|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nainika : అబ్యూజ్ చేస్తే భరించాలి అన్నట్టు ఉండిపోయింది.. సూసైడ్ ప్రయత్నం చేశాను..

Published: 16-09-2025, 12:40 PM
Nainika : అబ్యూజ్ చేస్తే భరించాలి అన్నట్టు ఉండిపోయింది.. సూసైడ్ ప్రయత్నం చేశాను..

ఢీ షో ద్వారా పేరు తెచ్చుకున్న నైనిక, తన జీవితంలోని కష్టకాలను, అబ్యూజ్ ను ఎదుర్కొన్న విధానాన్ని, సూసైడ్ ప్రయత్నం గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె అనుభవాలు చాలా కష్టతరమైనవి.

Key Points

1

ఢీ షో తర్వాత సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించింది.

2

బిగ్ బాస్ లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకుంది.

4

సూసైడ్ ప్రయత్నం గురించి వెల్లడించింది.

ఢీ షో నుండి బిగ్ బాస్ వరకు

Nainika : డ్యాన్స్ షో ఢీతో ఫేమ్ తెచ్చుకున్న నైనిక ఆ తర్వాత సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించింది. బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొని నైనిక మరింత గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక టీవీ షోలు, ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ డ్యాన్స్ మాస్టర్ గా, ఆర్టిస్ట్ గా ప్రయత్నాలు చేస్తుంది నైనిక.(Nainika)

తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో సూసైడ్ ప్రయత్నం కూడా చేశాను అని తెలిపింది.

అబ్యూజ్ మరియు మానసిక వేదన

సూసైడ్ ప్రయత్నం మరియు తరువాత

నైనికా మాట్లాడుతూ.. ఢీ షో ఎండింగ్ టైంలో సూసైడ్ అటెంప్ట్ చేశాను. నా ఫీలింగ్స్ ఎవరూ అర్ధం చేసుకోలేదు. నేను అందరికి చెప్పాలని చూశాను కానీ నన్ను ఎవరూ అర్ధం చేసుకోలేదు. కొన్ని సార్లు అబ్యూజ్ మనం భరించాలి అన్నట్టు ఉండిపోయింది ఇక్కడ. నాకు అది ఓకే కాదు. నేను దాని మీద ఫైట్ చేశాను. ఒక పది పన్నెండు మంది ముందు నన్ను నేనే తిట్టుకున్నా, ఏడ్చాను. ఒక మూడు నాలుగు నెలలు నేనేం ఏం చేస్తున్నానో నాకే తెలీదు. అడ్జస్ట్ అవ్వాలి అనుకున్నా. కానీ మెంటల్లీ సఫర్ అయ్యాను దానివల్ల. అందుకే అలా చేశాను అని తెలిపింది.

నైనిక తన అనుభవాలను తెలియజేయడం ద్వారా ఇతరులకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటోంది. అబ్యూజ్ ను ఎదుర్కొంటున్న వారు సహాయం కోసం ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.