|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nandini Rai: ఆ సినిమా ఎందుకు చేశావ్ అని అడిగారు

Published: 27-05-2025, 11:15 PM

బిగ్ బాస్ 2 సీజన్ ద్వారా గుర్తింపు పొందిన నందిని రాయ్, తన సినిమా జీవితం గురించి, ముఖ్యంగా ‘వారసుడు’ సినిమాలో తన అనుభవం గురించి, మరియు అనారోగ్య సమస్యల గురించి మాట్లాడింది.

Key Points

1

నందిని రాయ్ 'వారసుడు' సినిమాలో నటించిన అనుభవం గురించి మాట్లాడింది.

2

ఆమె పాత్ర ఎడిటింగ్‌లో తొలగించబడిందని, దాని వల్ల ఆమె బాధపడిందని తెలిపింది.

4

అనారోగ్యం కారణంగా చాలా సినిమా అవకాశాలను కోల్పోయిందని వివరించింది.

‘వారసుడు’ సినిమా అనుభవం

బిగ్‌బాస్ 2వ సీజన్‌లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న నందిని రాయ్.. తర్వాత చాలా సినిమాల్లో నటించింది. కానీ దళపతి విజయ్ ‘వారసుడు’ చేసి మాత్రం తప్పు చేశానని అంటోంది. అందుకు గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. మిస్ ఆంధ్రప్రదేశ్‌గానూ నిలిచింది. ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. ఎక్కువగా బోల్డ్ రోల్స్ చేస్తూ ఫేమస్ అయింది.

ఎడిటింగ్‌లో పాత్ర తొలగింపు

వారసుడు చిత్రంలో నటించడం గురించి మాట్లాడిన నందిని రాయ్.. ‘విజయ్ సర్ ‘వారసుడు’లో నాది చిన్న రోల్ కాదు. నెరేషన్ ఇచ్చినప్పుడు ప్రకాశ్ రాజ్ కూతురు పాత్ర, శ్రీకాంత్‌ని రెచ్చగొట్టి అతడి కుటుంబాన్ని విడదీయాలి. ఇదంతా షూటింగ్ కూడా చేశారు. కానీ ఎడిటింగ్‌లో సీన్లన్నీ తీసేశారు. మొత్తంగా చూస్తే మూవీలో 2 నిమిషాలు కూడా లేదు నా పాత్ర. రిలీజ్ తర్వాత ఎందుకు ఈ సినిమా చేశావ్ అనే ప్రశ్నలు వచ్చాయి. ఈ మూవీ చేసినందుకు మాత్రం బాధపడ్డాను. ఇదంతా నేను ఊహించలేదు. ఆ చిత్రం వల్ల నాపై నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. వారసుడు తరహా పాత్రలు మళ్లీ చేయను’ అని చెప్పుకొచ్చింది.

2011లో ‘040’ అనే తెలుగు సినిమాతో నందిని రాయ్ నటిగా మారింది. సుధీర్ బాబు ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రంలో హీరోయిన్ రోల్ పడింది. కానీ పెద్దగా ఉపయోగపడలేదు. సిల్లీ ఫెలోస్, శివరంజని, సీఎస్ఐ సనాతన్, భాగ్ సాలే తదితర చిత్రాలైతే చేసింది గానీ గుర్తింపు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చింది.

అనారోగ్య సమస్యలు మరియు సినిమా అవకాశాలు

అలానే తన అనారోగ్య సమస్యల గురించి కూడా నందిని రాయ్ బయటపెట్టింది. గతంలో స్నేహితులతో కలిసి గోవా వెళ్లినప్పుడు బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నా. నీటిలో ఒక గుడ్డ.. నా కాలికి పదేపదే తగులుతూ ఉంది. ఎన్నిసార్లు వదిలినా నా కాలికి చుట్టుకుంది. తీరా తీసి చూస్తే అందులో ఎవరికో చేతబడి చేసి రెండు బొమ్మలు, సూదులు గుచ్చి ఉన్నాయి. పువ్వులు, ఎవరిదో జుట్టు కూడా ఉంది. ఆ షాక్‌తో చాలా డిస్టర్బ్ అయ్యాను. మూడు రోజులు జ్వరంతో బాధపడ్డాను. దాని తర్వాత కొన్ని రోజులు అనారోగ్య సమస్యలు వేధించాయి. చావు మీద భయం వచ్చింది. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. అప్పుడు సినిమా ఆఫర్స్ వచ్చినా అనారోగ్యం వల్ల చేయలేకపోయాయను. ఆ మూవీస్ చేసుంటే నాకు సక్సెస్ వచ్చి ఉండేదేమో అని భావోద్వేగానికి గురైంది.

వారసుడు సినిమాలో తన పాత్ర తొలగించబడటం వల్ల నందిని రాయ్ బాధపడినట్లు తెలిసింది. అనారోగ్య సమస్యల వల్ల కూడా ఆమె చాలా సినిమా అవకాశాలను కోల్పోయింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.