|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూర్య `కరుప్పు` టీజర్‌పై ట్రోల్స్.. `గజిని`, `కలా`, `మాస్టర్` సినిమాలను తలపించేలా సీన్లు?

Published: 24-07-2025, 6:45 AM
సూర్య `కరుప్పు` టీజర్‌పై ట్రోల్స్.. `గజిని`, `కలా`, `మాస్టర్` సినిమాలను తలపించేలా సీన్లు?

సూర్య నటించిన కొత్త చిత్రం `కరుప్పు` టీజర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ టీజర్ ఇతర సినిమాలను తలపిస్తుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. సూర్య రెండు పాత్రల్లో కనిపించడం విశేషం.

Key Points

1

సూర్య 50వ పుట్టినరోజు సందర్భంగా `కరుప్పు` టీజర్ విడుదల.

2

టీజర్‌లోని సీన్లు `గజిని`, `కలా`, `మాస్టర్` వంటి సినిమాలను పోలి ఉన్నాయని నెటిజన్ల ఆరోపణ.

4

మాస్, యాక్షన్ ఎలిమెంట్లతో టీజర్ అదిరిపోయిందని అభిమానుల అభిప్రాయం.

కరుప్పు టీజర్ విడుదల: నెటిజన్ల విమర్శలు

సూర్య 50వ పుట్టినరోజు సందర్భంగా  ఆయన కొత్త మూవీ `కరుప్పు`  టీజర్ విడుదలైంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సూర్య, త్రిష, నట్టి, యోగిబాబు నటిస్తున్నారు. సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

`కరుప్పు` టీజర్‌లో మాస్టర్, బీస్ట్, కాలాా, గజిని, వేల్ అంజాన్, అన్నాత్తె వంటి సినిమాల సీన్లు కాపీ కొట్టినట్లు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. సూర్య గెటప్, సీన్లు విజయ్ సినిమాలను పోలి ఉన్నాయని అంటున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ తో రచ్చ చేస్తున్నారు.

ఇతర సినిమాలతో పోలికలు: ట్రోల్స్

సూర్య నలుపు చొక్కా రజినీ `కాలాా` సినిమాను గుర్తుకు తెస్తుంది. టీజర్‌లోని ప్రతి సీన్ కూడా ఇతర సినిమాలను పోలి ఉందని విమర్శలు వస్తున్నాయి. వాటర్‌ మిలన్‌ తినడం `గజిని` మూవీ నుంచి తీసుకున్నారని,  స్టయిల్‌, లుక్‌ పరంగా విజయ్‌ మాస్టర్‌ కి దగ్గగా ఉందని, రజనీ సినిమాలను పోలి ఉన్నాయని అంటున్నారు.

అయితే ఈ సారి సూర్య పూర్తి మాస్‌ మూవీతో వచ్చారు. ఒకప్పుడు వింటేజ్‌ సూర్యని చూపించే ప్రయత్నం చేశారు. టీజర్‌ మాత్రం మాస్‌, యాక్షన్‌ ఎలిమెంట్లతో అదిరిపోయింది. సూర్య కెరీర్‌లో ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

సూర్య రెండు పాత్రలు: కథాంశం

`కరుప్పు` చిత్రంలో సూర్య రెండు పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ పాత్రలో సూర్యగా కనిపించారు, తనకు మరో పేరు ఉందని అనడం విశేషం.   శరవణన్ అనే మరో పాత్రలో సూర్య నటించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఒక పాత్ర మాస్‌గా, పెద్దగా, మరో పాత్రలో యంగ్‌గా కనిపిస్తున్నారు  సూర్య. ఈ సినిమాలో ఆర్జే బాలాజీ విలన్ అని చెబుతున్నారు. ఈ మూవీ టీజర్‌ మంచి వ్యూస్‌తో దూసుకుపోతుంది.

మొత్తంగా, `కరుప్పు` టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, ఇతర సినిమాలతో పోలికలపై విమర్శలు వస్తున్నాయి. చిత్రం విజయవంతమవుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.