|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dhanashree Verma: చాహల్ మాజీ భార్య తొలి సినిమా రిలీజ్ కి రెడీ

Published: 07-05-2025, 8:19 AM
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య తొలి సినిమా రిలీజ్ కి రెడీ

క్రికెటర్ యజువేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ, తెలుగు సినిమా ‘ఆకాశం దాటివస్తావా’ తో తెలుగు తెరకు పరిచయమైంది. తాజాగా ఆమె హిందీ చిత్రంలో ఐటెం సాంగ్ లో నటిస్తోంది. విడాకుల తర్వాత ఆమె సినీ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.

Key Points

1

యజువేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తొలి సినిమా ప్రస్థానం.

2

తెలుగు సినిమా 'ఆకాశం దాటివస్తావా' లో నటించిన ధనశ్రీ.

4

సినిమాలపై దృష్టి సారించిన ధనశ్రీ భవిష్యత్తు హీరోయిన్ గా మారుతుందా?

ధనశ్రీ వర్మ సినిమా ప్రస్థానం

టీమిండియా క్రికెటర్, ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు ఆడుతున్న యజువేంద్ర చాహల్.. కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. 2020లో యూట్యూబర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మతో చాహల్ పెళ్లి జరిగింది. అయితే వీళ్ల బంధం చాలావరకు బాగానే ఉండేది. మరి ఏమైందో ఏమో గానీ గత కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉన్నారు. ఈ ఏడాది అధికారికంగా విడాకులు తీసేసుకున్నారు.

అయితే భర్త నుంచి విడిపోయిన తర్వాత ధనశ్రీ.. సినిమాల్లో బిజీ అయిపోతోంది. మొన్నీమధ్యే తెలుగులో ‘ఆకాశం దాటివస్తావా’ మూవీలో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు ఓ హిందీ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పుడీ ఈ విషయాన్ని ఈమెనే స్వయంగా వెల్లడించింది.

‘ఆకాశం దాటివస్తావా’ తర్వాత…

రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ హీరోహీరోయిన్లుగా నటించిన ‘భూల్ చుక్ మాఫ్’ చిత్రం మే 09న థియేటర్లలోకి రానుంది. ఇందులోని ప్రత్యేక గీతంలో ధనశ్రీ నర్తించింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే సినిమాల్లో నటించే విషయమై చాహల్-ధనశ్రీ మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారా అనే సందేహం వస్తోంది.

‘భూల్ చుక్ మాఫ్’ లో ఐటెం సాంగ్

ఎందుకంటే విడాకులు తీసుకున్న కొన్నిరోజుల తర్వాత తెలుగు, హిందీలో తాను చేస్తున్న సినిమాల గురించి ధనశ్రీ పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలు సక్సెస్ అయితే గనక ఈమె పూర్తిస్థాయిలో హీరోయిన్ గా మారిపోతుందేమో చూడాలి?

ధనశ్రీ వర్మ సినిమా ప్రస్థానం ఎంతవరకు విజయవంతం అవుతుందో, ఆమె భవిష్యత్తులో పూర్తిస్థాయి నటిగా ఎదగడం జరుగుతుందో తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.