|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nani : అమెరికాలో నాని మరో కొత్త రికార్డ్.. అమెరికా మార్కెట్ అంటే నాని అడ్డా అయిపోయింది.. మహేష్ తర్వాత నానినే..

Published: 04-05-2025, 1:16 AM
Nani : అమెరికాలో నాని మరో కొత్త రికార్డ్.. అమెరికా మార్కెట్ అంటే నాని అడ్డా అయిపోయింది.. మహేష్ తర్వాత నానినే..

అమెరికాలో తెలుగు సినిమాలకు మంచి ఆదరణ ఉంది. నాని తన వరుస సినిమాలతో అక్కడ మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాడు. తాజాగా విడుదలైన ‘హిట్ 3’ సినిమా కూడా అమెరికాలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

Key Points

1

నాని అమెరికాలో 11 సినిమాలతో 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించాడు.

2

హిట్ 3 సినిమా అమెరికాలో 2 మిలియన్ డాలర్లకు దగ్గరగా ఉంది.

4

మహేష్ బాబు తర్వాత అమెరికా మార్కెట్లో నాని రెండవ స్థానంలో ఉన్నాడు.

అమెరికాలో నాని సినిమాల విజయం

Nani : ఇండియన్ సినిమాలకు, ముఖ్యంగా తెలుగు సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అమెరికాలో కూడా మన సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ అవుతాయి. ఇటీవల మన హీరోలు అమెరికాకు వెళ్లి కూడా ప్రమోషన్స్ చేస్తున్నారంటే అక్కడ ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ అంటే మన రూపాయల్లో దాదాపు 8 కోట్లు కలెక్ట్ చేస్తే మంచి కలెక్షన్స్ వచ్చినట్టే. అమెరికాలో(America) 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ రావాలని స్టార్ హీరోల అభిమానులు కూడా కోరుకుంటారు. అమెరికాలో ఇప్పటివరకు ఎక్కువ 1 మిలియన్ డాలర్ సినిమాలు సాధించిన హీరో మహేష్ బాబు. మహేష్ బాబు ఏకంగా 12 సినిమాలకు 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించాడు అమెరికాలో. ఆ తర్వాత లిస్ట్ లో నానినే ఉన్నారు.

హిట్ 3 సినిమా అమెరికా కలెక్షన్స్

నానికి మొన్నటి వరకు 10 సినిమాలు ఉండగా తాజాగా రిలీజయిన హిట్ 3 సినిమా కూడా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేయడంతో నాని ఇప్పటివరకు మొత్తం 11 సినిమాలతో అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. నాని తర్వాతే జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్.. లాంటి స్టార్స్ ఉండటం గమనార్హం.

ఇక హిట్ 3 సినిమా ఇప్పటికే దాదాపు 70 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 100 కోట్లకు దూసుకెళ్తుంది. అమెరికాలో కూడా ఆల్మోస్ట్ 2 మిలియన్ డాలర్స్ కి చేరువలో ఉంది. అలాగే నాని బ్యాక్ టు బ్యాక్ వరుసగా 4 సినిమాలకు 1.5 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసాడు. మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ తర్వాత నానినే ఈ రికార్డ్ సాధించాడు.

మహేష్ బాబుతో పోలిక

మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు కాబట్టి ఆ సినిమా వచ్చేలోపు నాని ఇంకో రెండు సినిమాలు రిలీజ్ చేసి అమెరికాలో మహేష్ రికార్డ్ ని దాటేసి 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తాడని ఫ్యాన్స్, టాలీవుడ్ జనాలు అంటున్నారు. నాని కంటెంట్ ని నమ్ముకొని వరుస హిట్స్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు.

మొత్తం మీద, నాని అమెరికా బాక్స్ ఆఫీస్‌లో తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. భవిష్యత్తులో మరింత విజయాలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.