
నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా నాని విలేకరులతో మాట్లాడుతూ, పహల్గామ్‌లోని షూటింగ్, సినిమా ప్రత్యేకతలు, మరియు షూటింగ్ సమయంలో జరిగిన ఘటన గురించి వివరించారు.
Key Points
హిట్ 3 చిత్రం విడుదలపై నాని స్పందనలు
పహల్గామ్‌లో 18 రోజుల షూటింగ్ అనుభవం
సినిమాలోని యాక్షన్ మరియు వయోలెన్స్ గురించి వివరణ
షూటింగ్ సమయంలో జరిగిన బాధాకర ఘటన
హిట్ 3 విడుదలపై నాని కామెంట్స్
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ తెలుగు వయోలెంట్ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం హిట్ 3. డాక్టర్ అండ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ ది థర్డ్ కేస్ మూవీలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటి శ్రీనిధి శెట్టి చేసింది. ఇవాళ (మే 1) థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా హిట్ 3 మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో హీరో నాని హిట్ 3 విశేషాలు పంచుకున్నారు.
-బ్రహ్మాండంగా ఉంది. షూటింగ్ కోసం అలాగే ప్రమోషన్స్ కోసం దేశ మొత్తం తిరిగాం. ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఆడియన్స్ సినిమాని చూడాలని ఫిక్స్ అయిపోయారు. సినిమా రాకముందే అలాంటి ఒక పాజిటివ్ వైబ్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
పహల్గామ్ షూటింగ్ అనుభవం
-హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు కూడా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్. హిట్ 3 వచ్చేసరికి యాక్షన్ వయోలెన్స్ కథ డిమాండ్‌ని బట్టి వచ్చింది. ఇది రెగ్యులర్ సినిమాల ఉండదు. చాలా రిలేటబుల్, స్టైలిష్‌గా ఉంటుంది. ఆర్గానిక్‌గా కుదిరిన కొన్ని ఎలిమెంట్స్ వల్ల సినిమాలో చూస్తున్నప్పుడే విజిల్ వర్తీ మూమెంట్స్ చాలా ఉంటాయి . ఈ సినిమాని వయోలెన్స్ కోసం తీయలేదు. కథలో ఆర్గానిక్‌గా వయోలెన్స్ ఉంది. అది సినిమా చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది.
-అడ్వాన్స్ బుకింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ జోనర్ సినిమా. టార్గెట్ ఆడియన్స్‌ని మెప్పిస్తే కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్‌ని కచ్చితంగా మెప్పిస్తుంది.
సినిమాలోని యాక్షన్ మరియు వయోలెన్స్
-షాన్ గారు అద్భుతమైన కెమెరామెన్. ఆయన విజువల్‌తో ఒక స్టోరీ చెప్పాలని ప్రయత్నిస్తారు. ఆయన పెట్టే ప్రతి ఫ్రేమ్ వెనక ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. ఆయన ఒక షాట్ పెడితే అది ఆడియన్స్‌ని ఏం ఫీలయ్యాలా చేస్తుందో అనే క్లారిటీతోనే పెడతారు. ఆయన విజువల్స్ ఎమోషన్‌ని ఎన్హాన్స్ చేస్తాయి. ఈ సినిమాకి వెరీ ఇంపాక్ట్‌ఫుల్ కెమెరా వర్క్ ఇచ్చారు.
-పహల్గమ్ డిఫరెంట్ లోకేషన్స్‌లో 18 రోజులు షూట్ చేశాం. మొన్న జరిగిన ( ఉగ్రదాడి ) ఘటన మమ్మల్ని కలిచివేసింది. అలాగే ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడే డీవోపీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి అనారోగ్య కారణాల వల్ల కోల్పోవడం జరిగింది. ఆ ఘటన కూడా మమ్మల్ని చాలా బాధించింది.
హిట్ 3 సినిమా షూటింగ్ సమయంలో జరిగిన దురదృష్టవంతమైన సంఘటన నానిని బాధించిందని, అయినప్పటికీ సినిమా బాగుందని ఆయన తెలిపారు. ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నారు.

