
నేచురల్ స్టార్ నాని, సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘బ్లడీ రోమియో’పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Key Points
నాని-సుజిత్ కాంబోలో 'బ్లడీ రోమియో' అనే భారీ ప్రాజెక్ట్ రాబోతోంది.
ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
హీరోయిన్‌గా రుక్మిణి వసంత్, పూజా హెగ్డేలతో చర్చలు జరిపి పూజనే ఖరారు చేసినట్లు టాక్.
పూజా హెగ్డేకు ఈ సినిమా హిట్ ఇచ్చి లక్ కలిసొస్తుందా అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నాని భారీ ప్రాజెక్ట్ వివరాలు
నేచురల్ స్టార్ నాని(nani) ‘ది ప్యారడైజ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల నాని ఓ భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా సుజీత్, నాని కాంబోలో రాబోతుంది. ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo)పేరుతో రాబోతుండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని వెంకట్ బోయపల్లి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ రుక్మిణి వసంత్, పూజా హెగ్డేల(Pooja Hegde)తో చర్చలు జరిపినప్పటికీ బుట్టబుమ్మనే కన్ఫర్మ్ చేసినట్లు టాక్. ఇక పూజా హెగ్డేను స్టోరీ నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక నాని-పూజా కాంబోలో రాబోతున్న మొదటి ప్రాజెక్ట్ కావడం విశేషం. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఈ సారైనా ఈ అమ్మడుకి లక్ కలిసొచ్చి హిట్ అందుకుంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పూజా హెగ్డే ఎంపికపై చర్చ
పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర
నాని-పూజా హెగ్డేల కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతోనైనా పూజా హెగ్డేకు లక్ కలిసి వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంటుందా అనేది వేచి చూడాలి.


