|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాని ‘ప్యారడైజ్’ సెన్సేషనల్: ‘ఆయా షేర్’ వెనుక షాకింగ్ సీక్రెట్స్ రివీల్!

Published: 13-03-2026, 3:05 PM
నాని 'ప్యారడైజ్' సెన్సేషనల్: ‘ఆయా షేర్’ వెనుక షాకింగ్ సీక్రెట్స్ రివీల్!
  • నాని ‘ది ప్యారడైజ్’ కోసం భారీ సెట్స్ నిర్మాణం!
  • ‘ఆయా షేర్’ పాట కోసం 2.5 ఎకరాల్లో విలేజ్ సెట్ వేయడం జరిగింది.
  • హీరో ఇంటి సెట్ 60 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తుతో నిర్మించారు.
  • ఈ పాటలో 500 మంది ఒకేసారి ఉండేలా గ్రామం డిజైన్!

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం ఒక సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం నుంచి వచ్చిన ‘ఆయా షేర్’ పాట ఇప్పటికే ఒక బ్లాక్ బస్టర్ హిట్.

‘ఆయా షేర్’ సాంగ్ మేకింగ్ విశేషాలు

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం నుంచి రీసెంట్‌గా వచ్చిన ‘ఆయా షేర్’ పాట ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ పాటకు వచ్చిన గ్రాండ్ లుక్ వెనుక ప్రధాన కారణం ఆర్ట్ డిపార్ట్‌మెంట్ రూపొందించిన అద్భుతమైన సెట్స్. గ్రాండియర్‌తో పాటు సహజత్వాన్ని కలిపి ఈ సెట్స్ రూపొందించారు. అత్యంత ఆకట్టుకునే సెటప్‌లలో ఒకటి హీరో హౌస్ (కమాన్ సెట్). హీరో పవర్‌ఫుల్ డిప్ మోమెంట్ కోసం ప్రత్యేకంగా ఈ భారీ నిర్మాణాన్ని రూపొందించారు. ఈ నిర్మాణం వెడల్పు 60 అడుగులు, ఎత్తు 45 అడుగులు, లోతు 25 అడుగులతో నిర్మించబడింది. దాదాపు 25 మంది కార్మికులు సుమారు 20 రోజుల పాటు శ్రమించి ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేశారు. వాటర్ బాడీ విలేజ్ సెట్ మరో హైలెట్. ఇది 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది. ఇందులో డమ్మీ నిర్మాణాలు కాకుండా పూర్తిగా నిర్మించిన 60 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 50 మంది కార్మికులు 30 రోజుల పాటు శ్రమించి ఈ గ్రామాన్ని నిర్మించారు. ఒకేసారి సుమారు 500 మంది ఉండేలా ఈ గ్రామాన్ని డిజైన్ చేశారు. ఇలా ఇందులో ఉండే ప్రతి అద్భుత నిర్మాణలతో ప్రేక్షకులకు ‘ఆయా షేర్’ పాటలో చూసిన విజువల్ వరల్డ్ మెస్మరైజ్ చేసింది.“ది ప్యారడైజ్” వరల్డ్ బిగ్ స్క్రీన్ పై ఎంత గొప్ప అనుభూతిని అందించబోతోందో ‘ఆయా షేర్’ సాంగ్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది.

విలేజ్ సెట్ నిర్మాణంలో అద్భుత సృష్టి

హీరో ఇంటి కోసం భారీ సెట్!

‘ది ప్యారడైజ్’ చిత్రం ‘ఆయా షేర్’ పాటతోనే అంచనాలు పెంచేసింది. సినిమా విడుదల కోసం ఎదురుచూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.