|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాని ‘ది ప్యారడైజ్’ విడుదల వెనుక అసలు రహస్యం ఇదేనా? దర్శకుడి ప్లానింగ్ మామూలుగా లేదుగా!

Published: 12-02-2026, 10:35 AM
నాని 'ది ప్యారడైజ్' విడుదల వెనుక అసలు రహస్యం ఇదేనా? దర్శకుడి ప్లానింగ్ మామూలుగా లేదుగా!
  • నాని ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న విడుదల కానుంది.
  • సినిమా విడుదల తేదీ వెనుక పెద్ద స్కెచ్ ఉందని సమాచారం.
  • విడుదలైన మూడు వారాల్లో 10 సెలవులు రానున్నాయి.
  • రజనీకాంత్ ‘జైలర్ 2’తో పోటీ పడే అవకాశం ఉంది.

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉందని తెలుస్తోంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగస్టు 21నే విడుదల చేయడానికి కారణం?

The Paradise film: నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చ్ 26వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఇంకా షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో వాయిదా పడింది. ఇలా మార్చి 26వ తేదీ నుంచి ఈ సినిమా ఏకంగా ఆగస్టు 21వ తేదీకి వాయిదా పడటంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత ఆలస్యంగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం పట్ల అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక నాని సినిమా ఆగస్టు 21వ తేదీ విడుదల చేయబోతున్న నేపథ్యంలో అదే రోజు ఎందుకు విడుదల చేయబోతున్నారనే విషయంపై కూడా అభిమానులు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

ది ప్యారడైజ్ సినిమాని ఆగస్టు 21వ తేదీ విడుదల చేయడానికి కారణం లేకపోలేదు ఈ విడుదల తేదీ వెనుక పెద్ద స్కెచ్ ఉందని చెప్పాలి. ఈ సినిమా ఆగస్టు 21వ తేదీ అంటే శుక్రవారం విడుదల చేస్తే 22, 23 తేదీలలో వీకెండ్. అదేవిధంగా ఆగస్టు 26వ తేదీ బుధవారం ఓనం అలాగే మిలాద్ ఉన్ నబీ ఆగస్టు 28 వ తేదీ శుక్రవారం రక్షాబంధన్ 29వ తేదీ శనివారం 30వ తేదీ ఆదివారం కలిసి వస్తుంది. ఇక మూడో వారంలో భాగంగా సెప్టెంబర్ నాలుగో తేదీ శుక్రవారం అలాగే జన్మాష్టమి సెలవు. సెప్టెంబర్ 5 శనివారం ఆరో తేదీ ఆదివారం ఇలా ఈ సినిమా సినిమా విడుదలైన మూడు వారాల వ్యవధిలో ఏకంగా 10 సెలవులు రావడం విశేషం.

సినిమాకు కలిసొచ్చే సెలవులు ఎన్ని?

ఇలా వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఇలా వరుస సెలవులు రావడం చూసిన అభిమానులు నాని ది ప్యారడైజ్ రిలీజ్ డేట్ చాలా పర్ఫెక్ట్ డేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు పోటీగా రజనీకాంత్ సినిమా కూడా ఉండబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నాని సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది కానీ జైలర్ 2 విడుదల తేదీని ప్రకటించలేదు. అయితే ఈ సినిమా ఆగస్టు 21వ తేదీ విడుదల కాబోతుందంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఒకవేళ ఇదే తేదీ కన్ఫర్మ్ అయితే కచ్చితంగా ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ పడపోతున్నాయి.

తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో..

రజనీకాంత్ ‘జైలర్ 2’తో పోటీ తప్పదా?

ఇక ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంటుతో యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరోయిన్ గా కయాదులోహర్ నటించగా, సోనాలి కులకర్ణి నాని తల్లి పాత్రలో కనిపించబోతున్నారు .ఇక మోహన్ బాబు సంపూర్ణేష్ బాబు తనికెళ్ల భరణి వంటి తదితరులు కూడా ఈ సినిమాలో భాగం అయిన సంగతి తెలిసిందే.

‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల తేదీని సెలవులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించారని తెలుస్తోంది. ఒకవేళ రజనీకాంత్ ‘జైలర్ 2’ కూడా అదే రోజు వస్తే బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.