|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాని మాస్ జాతర షురూ! ‘ది ప్యారడైజ్’ నుంచి ఊర మాస్ సాంగ్ రిలీజ్.. రికార్డులు బద్దలే!

Published: 25-02-2026, 11:35 AM
నాని మాస్ జాతర షురూ! ‘ది ప్యారడైజ్’ నుంచి ఊర మాస్ సాంగ్ రిలీజ్.. రికార్డులు బద్దలే!
  • నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో ‘ది ప్యారడైజ్’ మూవీ!
  • రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.
  • ఆగస్టు 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల.
  • నాని రగ్డ్ లుక్, స్వాగ్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్!

న్యాచురల్ స్టార్ నాని మరోసారి బాక్సాఫీస్ బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. ఈ మూవీలోని ‘ఆయా షేర్’ సాంగ్ రిలీజ్ అయింది.

నాని మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా!

కల్ట్ హిట్‌ దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ మేకర్ శ్రీకాంత్ ఓదెల బిగ్ కాన్వాస్‌పై బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌ ది ప్యారడైజ్ కోసం రెండవసారి కలిశారు. SLV సినిమాస్ ఆధ్వర్యంలో సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ అయింది. ఇక రీసెంట్‌గా వచ్చిన ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ ప్రోమో విడుదలై అంచనాలను భారీగా పెంచగా.. ఇప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అంచనాలని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళాడు.

ట్రైబల్ పర్కషన్‌తో పాటు గ్రిటీ ఎలక్ట్రానిక్ సౌండ్స్‌ను కలిపి, ప్రైమల్ ఎనర్జీతో నిండిన థండరస్ మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ అందించాడు. సెలబ్రేషన్, అడ్రినలిన్ రెండింటి మేళవింపుగా ఈ పాట అదిరిపోయింది. నాని ట్రాన్స్‌ఫర్మేషన్ ఈ పాటలో హైలెట్ గా నిలిచింది. జడలతో కూడిన హెయిర్ స్టైల్, గడ్డం, రెడ్ బ్లేజర్‌తో రగ్గడ్ లుక్‌లో ఆయన వారియర్, ఐకాన్‌లా కనిపిస్తున్నారు. నాయకుడిగా ఆయన స్వాగ్ అదిరిపోయింది. “ది ప్యారడైజ్ ” చిత్రం ఆగస్టు 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో పాన్ వరల్డ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

అనిరుధ్ మ్యూజిక్ తో ఊర్రూతలూగాల్సిందే!

‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది. ఆగస్టు 21న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.