
📌 Key Points
- నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో ‘ది ప్యారడైజ్’ మూవీ!
- ‘ఆయా షేర్’ సాంగ్ ప్రోమో రిలీజ్.. నాని మాస్ లుక్‌తో అదరగొట్టాడు.
- అనిరుధ్ రవిచందర్ సంగీతం.. ఫిబ్రవరి 24న పూర్తి పాట విడుదల.
- కయాదు లోహర్ హీరోయిన్, మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 24న విడుదల!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.
నాని మాస్ లుక్‌తో ఫ్యాన్స్ పండగ!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని(nani), డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి, అంతకు మించిన పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో ‘ది ప్యారడైజ్’ (The Paradise)అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘ఆయా షేర్’ అనే పేరుతో వచ్చిన ఈ సాంగ్ ప్రోమోలో నాని కనిపించిన తీరు అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
గడ్డం, జుట్టు పెంచి రెండు జడలతో పక్కా మాస్ లుక్‌లో నానిని చూస్తుంటే, శ్రీకాంత్ ఓదెల మరోసారి థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమనిపిస్తోంది. ముఖ్యంగా నాని బాడీ లాంగ్వేజ్ ,స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రోమోలో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ పూర్తి పాట ఫిబ్రవరి 24న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. అనిరుధ్-నాని కాంబోలో వచ్చే పాటలు ఎప్పుడూ చార్ట్ బస్టర్స్ అవుతాయి.. ఇప్పుడు ఈ ‘ఆయా షేర్’ సాంగ్ కూడా అదే బాటలో సాగబోతోంది. కాగా.. ఈ సినిమాలో నాని సరసన అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘ది ప్యారడైజ్’, ఆగస్టు 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
అనిరుధ్ మ్యూజిక్.. థియేటర్లు షేక్!
‘ది ప్యారడైజ్’ రిలీజ్ ఎప్పుడంటే?
‘ది ప్యారడైజ్’ సినిమా ఆగస్టు 24న విడుదల కానుంది. నాని మాస్ లుక్‌లో అదరగొట్టాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


