
📌 Key Points
- నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ చిత్రం రాబోతోంది.
- ఈ సినిమా నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతోంది, తల్లి కొడుకుల సెంటిమెంట్ ప్రధానాంశం.
- హిందీ థియేట్రికల్ రైట్స్ కోసం జియో స్టూడియోస్ భారీ ఆఫర్ తో పోటీ పడుతున్నట్టు సమాచారం.
- ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో 8 భాషల్లో విడుదల కానుంది, నాని జడల అనే విభిన్న పాత్రలో కనిపించనున్నారు.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం భారీ అంచనాలతో సిద్ధమవుతోంది. ఈ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ కోసం జియో స్టూడియోస్ పోటీ పడుతుండటం విశేషం.
నాని ‘ది ప్యారడైజ్’ మూవీ విశేషాలు
The paradise: నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది ప్యారడైజ్(The Paradise). నాని కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. తల్లి కొడుకుల సెంటిమెంట్ తో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో భారీగా అంచనాలు కూడా ఉన్నాయి. ముందుగా అనుకున్న తేదీ ప్రకారం మార్చ్ 26వ తేదీ విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడుతుంది. ఇలా మార్చి నుంచి తప్పుకున్న ఈ సినిమా జూన్ లేదా జూలై నెలలో విడుదల కాబోతోందని సమాచారం. ప్రస్తుతం చిత్ర బృందం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో బిజినెస్ కూడా ప్రారంభమైందని తెలుస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కు భారీగా పోటీ ఉండబోతుందని తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ కు భారీ పోటీ ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా రైట్ కోసం వివిధ సంస్థలు పోటీపడుతున్నప్పటికీ జియో స్టూడియోస్ మాత్రం భారీ ఆఫర్ ఇస్తూ హిందీ థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ దాదాపు జియో స్టూడియోస్ కైవసం చేసుకున్నారని సమాచారం. త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
హిందీ థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ
ఈ సినిమాలో నాని జడల అనే విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. రెండు జడలతో పొడుగాటి మీసాలు, గుబురు గడ్డంతో నాని ఎంతో విభిన్నంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా విభిన్నమైన కథతో నాని ది ప్యారడైజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఏ సినిమాలో నాని జోడిగా కయాదు లోహర్ నటించగా నాని తల్లి పాత్రలో సీనియర్ నటి సోనాలి కులకర్ణి నటించబోతున్నారు. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి వంటి తదితరులు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి కేవలం నటీనటుల ఫస్ట్ పోస్టర్లు మాత్రమే విడుదల చేశారు అయితే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఒక బిగ్ అప్డేట్ కూడా వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందని మేకర్స్ వెల్లడించడంతో అభిమానులు కూడా ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఫిబ్రవరి 24వ తేదీ విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అదే రోజు నాని పుట్టినరోజు కావడంతో ఫస్ట్ సింగిల్ విడుదల చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్థాయిలో విడుదల
నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా నాని కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశిద్దాం.



Sargun Mehta Urges People to Stop Negative Comments and Trolling Online