|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nara Brahmani: ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి

Published: 14-12-2025, 6:48 AM
Nara Brahmani: ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి
  • హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణికి ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు.
  • ‘బిజినెస్ టుడే’ మ్యాగజైన్ ఈ గౌరవాన్ని అందించింది.
  • ముంబై వేదికగా జరిగిన వేడుకలో బ్రాహ్మణి ఈ అవార్డు అందుకున్నారు.
  • నాయకత్వం, బాధ్యతాయుతమైన విలువ గురించి ఆమె ప్రసంగం.

హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి ‘బిజినెస్ టుడే’ నుంచి ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు లభించింది. ప్రముఖ నటుడు బాలకృష్ణ కుమార్తెగా, నారా లోకేశ్ సతీమణిగా ఆమె సినీ కుటుంబంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ అరుదైన గౌరవంతో బ్రాహ్మణి జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యారు.

నారా బ్రాహ్మణికి అరుదైన గౌరవం

Nara Brahmani: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ భార్య, హీరో బాలకృష్ణ కూతురు, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి(Nara Brahmani) అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ ‘బిజినెస్ టుడే’ అందించే ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ముంబై వేదికగా జరిగిన ఈ వేడుకలో బ్రహ్మణి ఈ అవార్డును అందుకున్నారు. దీంతో ఆమె నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యారు. ఈ సందర్బంగా బ్రాహ్మణి మాట్లాడుతూ.. “ఈ గుర్తింపు దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. నాయకత్వం అంటే శాశ్వతంగా నిలిచిపోయే సంస్థలను ఏర్పాటు చేయడం, బాధ్యతాయుతమైన విలువను సృష్టించడం. తద్వారా ప్రజలను శక్తివంతం చేయడం. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు ‘బిజినెస్ టుడే’ వారికి నా ధన్యవాదాలు. భారతదేశవ్యాప్తంగా ఉన్న మహిళా నేతలను ఇలా ప్రోత్సహించడం అనేది నిజంగా అభినందనీయం” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో, ఆమెకు సోషల్ మీడియా వేదికగా చాలా మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ నుంచి స్ట్రాంగ్ ప్లేయర్ ఔట్.. టాప్ 5 లిస్ట్ ఇదే.. ఆ ఇద్దరి మధ్యే పోటీ

‘బిజినెస్ టుడే’ అవార్డు ప్రదానం

బ్రాహ్మణి స్పందన, శుభాకాంక్షలు

నారా బ్రాహ్మణి ఈ అవార్డు అందుకోవడం మహిళా నాయకత్వానికి గొప్ప ప్రేరణ అని చెప్పవచ్చు. ఆమె తన ప్రసంగంలో నాయకత్వం, విలువలు గురించి స్పష్టం చేశారు. ఈ అరుదైన గుర్తింపు పొందినందుకు బ్రాహ్మణికి అనేక శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.