|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nara Rohit Marriage: ఘనంగా నారా రోహిత్‌ వివాహం..

Published: 31-10-2025, 10:40 AM
Nara Rohit Marriage: ఘనంగా నారా రోహిత్‌ వివాహం..

టాలీవుడ్ నటుడు నారా రోహిత్ సినీ నటి శిరీషతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన వీరి వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Key Points

1

టాలీవుడ్ నటుడు నారా రోహిత్ నటి శిరీషను వివాహం చేసుకున్నారు.

2

హైదరాబాద్‌లో గురువారం రాత్రి వీరి వివాహం ఘనంగా జరిగింది.

4

‘ప్రతినిధి 2’ సినిమాతో మొదలైన ప్రేమ.. పెళ్లి బంధంతో ఒక్కటైంది.

నారా రోహిత్-శిరీష వివాహ వేడుక

టాలీవుడ్ ‌ నటుడు నారా రోహిత్‌ ( Nara Rohit) వివాహబంధంలోకి అడుగుపెట్టారు . తను ప్రేమించిన సినీ నటి శిరీష (సిరి) ( Sireesha) తో కలిసి ఏడడుగులు వేశారు . హైదరాబాద్ ‌ లో గురువారం రాత్రి ఘనంగా వారి వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు . వధూవరులను ఆశీర్వదించారు . వీరి పెళ్లికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ ‌ అవుతున్నాయి.

నారా రోహిత్‌ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష యాక్ట్‌ చేసింది. ఈ మూవీలో రోహిత్‌ ప్రియురాలిగా నటించింది. నిజ జీవితంలోనూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. మనసులు ఒక్కటయ్యాక ఆశీర్వదించకుండా ఎలా ఉంటామంటూ ఇరు కుటుంబాలు గతేడాది అక్టోబర్‌లో వీరికి ఎంగేజ్‌మెంట్‌ చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే.

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట

హాజరైన ప్రముఖులు, విశేషాలు

‘ప్రతినిధి 2’ సినిమాతో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం పెళ్లి బంధంతో పదిలంగా మారింది. నారా రోహిత్, శిరీష కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలుపుతూ, వారి భవిష్యత్తు సుఖ సంతోషాలతో నిండాలని ఆశిస్తున్నాము.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.