|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒరిజినల్‌గా ఇది వెట్రిమారన్ కథ.. ముగ్గురు హీరోలతో సినిమా చేయడం అంత ఈజీ కాదు.. హీరో నారా రోహిత్ కామెంట్స్

Published: 29-05-2025, 1:56 AM
ఒరిజినల్‌గా ఇది వెట్రిమారన్ కథ.. ముగ్గురు హీరోలతో సినిమా చేయడం అంత ఈజీ కాదు.. హీరో నారా రోహిత్ కామెంట్స్

వెట్రిమారన్ నిర్మాతగా వ్యవహరించిన గరుడన్ సినిమా తెలుగు రీమేక్‌గా భైరవం తెరకెక్కింది. ఈ సినిమాలో నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ హీరోలుగా నటించారు. సినిమా విడుదల నేపథ్యంలో నారా రోహిత్ తన అనుభవాలను పంచుకున్నారు.

Key Points

1

వెట్రిమారన్ కథాంశంతో తెరకెక్కిన భైరవం సినిమాలో నారా రోహిత్ నటన

2

ముగ్గురు హీరోలతో సినిమా చేయడం గురించి నారా రోహిత్ అనుభవం

4

తెలుగు ప్రేక్షకుల కోసం సినిమాలో చేసిన మార్పులు

భైరవం సినిమా విశేషాలు

తమిళంలో వెట్రిమారన్‌కు డైరెక్టర్‌గా ఎంతో పేరు ఉంది. అలాంటి వెట్రిమారన్ నిర్మాతగా వ్యవహరించి సాలిడ్ హిట్ అందుకున్న సినిమా గరుడన్. ఈ మూవీని తెలుగులో రీమేక్‌గా తెరకెక్కించిన సినిమా భైరవం . విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవం మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ , నారా రోహిత్ హీరోలుగా నటించారు.

అదితి శంకర్ హీరోయిన్‌గా నటించిన భైరవం సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మాతగా వ్యవహరించి నిర్మించారు. పెన్ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పించిన భైరవం మే 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వెట్రిమారన్, నిర్మాత రాధామోహన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నారా రోహిత్ ఇతర సినీ విశేషాలను పంచుకున్నాడు.

-ఇందులో జయసుధ గారు బామ్మ క్యారెక్టర్ చేశారు. జయసుధ గారు లెజెండరీ. సార్ వచ్చారు తర్వాత వారితో వర్క్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది.

నారా రోహిత్ అనుభవాలు

-నేను యాక్షన్ సినిమాలు చేశాను కానీ ఇంత కమర్షియల్ మాస్ ఫిలిం నేనెప్పుడూ చేయలేదు. ఇది నాకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్. ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

-ఈ సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకి మేజర్ హైలైట్. చాలా రోజుల తర్వాత ఇంత హెవీ యాక్షన్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. మేము ముగ్గురు కలిసి చేసిన ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్‌కి చాలా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది .

-స్టోరీ లైన్ అదే ఉంటుంది. అయితే తెలుగులోకి వచ్చేసరికి ప్రతి సీన్‌ని రీరైట్ చేసాం. మన నేటివిటీకి తగ్గట్టు సినిమా ఉంటుంది. సినిమా మీరు చూస్తున్నప్పుడు ఒరిజినల్ కంటే మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.

వెట్రిమారన్ కథాంశం

-ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ ఉండదు. ఒరిజినల్‌గా ఇది వెట్రిమారన్ గారి కథ. ప్రతి పాత్రకి కథలో చాలా కీలక పాత్ర ఉంటుంది.

-రాధా మోహన్ గారి లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. ముగ్గురు హీరో లతో ఒక సినిమా చేయడం అంత ఈజీ కాదు. ఎక్కడ రాజీ పడకుండా సినిమా తీశారు. ఆయనకి ఈ సినిమాతో పెద్ద సక్సెస్ రావాలని భారీగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.

చివరగా, భైరవం సినిమా తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని నారా రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాతలకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.