
📌 Key Points
- నరేష్ కామెంట్స్ వైరల్: మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి!
- హే భగవాన్ మూవీ ఈవెంట్ లో నరేష్ సంచలన వ్యాఖ్యలు, హాట్ టాపిక్ గా మారాయి.
- చీర మన సంప్రదాయం అంటూ నరేష్ చేసిన కామెంట్స్ కు కొందరు మద్దతు, మరికొందరు విమర్శలు.
- సోషల్ మీడియాలో నరేష్ కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
టాలీవుడ్ లో మరో వివాదం రాజుకుంది! నటుడు నరేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలేం జరిగిందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదవండి!
హే భగవాన్ ఈవెంట్ లో నరేష్ సంచలన వ్యాఖ్యలు
Naresh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన హే భగవాన్ అనే సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మహిళలు చీరలు ధరించడంపై స్పందించాడు. అది మన సంప్రాదాయం అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో నరేష్ చేసిన ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. సుహాస్- శివాని జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ హే భగవాన్.
చీర సంప్రదాయంపై నరేష్ కామెంట్స్ వైరల్
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో నరేష్(Naresh) మాట్లాడుతూ.. వాలెంటైన్ వీక్ లో భాగంగా ఈరోజు హాగ్ డే. ఇక్కడ అందరికీ హాగ్ ఇచ్చాను.. మీకు కూడా ఇచ్చేవాడిని( హీరోయిన్ శివాని, యాంకర్ స్రవంతిను ఉద్దేశిస్తూ). కానీ మీరు చీరలో ఉన్నారు. ఈ మధ్య చాలా మంది మహిళలు ఈవెంట్ లకి చీరకు కట్టుకొని వస్తున్నారు. ఇది మన సంప్రదాయం. హాగ్ ఇవ్వడం అనేది మన సంప్రదాయం కాదు. కాబట్టి, మీరు ఇద్దరు హగ్ చేసుకోండి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు నరేష్.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు.. దుమారం
నరేష్ చేసిన ఈ కామెంట్స్ కి అక్కడున్న వాళ్ళు నవ్వుకున్నారు. అయితే, నరేష్ చేసిన ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. చాలా మంది నరేష్ చేసిన కామెంట్స్ ని సమర్దిస్తుంటే. మరోకొంత మంది మహిళల వస్త్రధారణ అనేది వారి వ్యక్తిగతమైన ఆలోచన. దాని గురించి కామెంట్స్ చేయడానికి మీరెవరు. రీసెంట్ గా పెద్ద వివాదం జరిగిన ఆ విషయం గురించి ఆ స్టేజిపై ప్రస్తావించడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా లేక ఎక్కడికి దారి తీస్తుంది అనేది చూడాలి.
నరేష్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

