
నటుడు నరేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దేశ ద్రోహిని కాదని స్పష్టం చేస్తూ, ఈ నిర్ణయం తొందరపాటు అని విమర్శించారు. ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Key Points
నటుడు నరేష్ ఇథనాల్ కలిపిన పెట్రోల్ విధానంపై కేంద్రంపై ఫైర్.
"నేను దేశ ద్రోహిని కాదు" అంటూ బీజేపీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు.
ఇథనాల్ వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని నరేష్ ఆందోళన.
పర్యావరణం ముఖ్యం, కానీ ప్రజల నష్టం పణంగా కాదని నరేష్ వాదన.
నరేష్ పోస్ట్ లో ఏముంది?
Naresh : తెలుగు సినీ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. ఒక్కో సినిమా తో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సినిమాలలో కీలకపాత్రలో నటించడంతో పాటుగా. సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.. ఇటీవల కాలంలో నరేష్ సినిమాలు కన్నా ఎక్కువగా సోషల్ మీడియా వార్తలతో బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు.. మరోసారి ఈయన పేరు వార్తల్లో హైలెట్ అవుతుంది.. ఆయన చేసిన ఒక పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. అసలు ఏం జరిగింది?ఎందుకు నరేష్ అలా మాట్లాడుతున్నారు?అన్నది ఇప్పుడు కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
ఈ మధ్య కాలంలో యుద్ధం కారణంగా పెట్రోల్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే కదా.. దీనిపై ఇప్పటికే రాజకీయాల్లో చర్చలు మొదలయ్యాయి..ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడటం వల్ల వాహనాల మైలేజీ తగ్గుతోందని, ఇంజిన్లు దెబ్బతింటున్నాయని వాదన సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలి అంటూ తాజాగా సినీ నటుడు నరేష్ ఒక పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.. అందులో ఏముందంటే.. నేనేమి దేశ ద్రోహిని కాదు.. పెట్రోల్, ఇథనాల్ పై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తొందరపాటు.. ఇథనాల్ కలిపిన ఆయిల్ ని వాడడం వల్ల బైకులకే కాదు అటు కార్ల ఇంజన్ల పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా మారింది అని ఆయన అంటున్నారు. కారుకి ఇంజన్ల సమస్య వస్తే దానికి అంతకుమించి ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే నేను రేట్ ఎక్కువైనా పర్వాలేదు కానీ 165 రూపాయలు పెట్టి పెట్రోల్ పట్టిస్తున్నాను అని నరేష్ అంటున్నారు. పర్యావరణ పరిరక్షణ అవసరమే. కానీ ఇథనాల్ మిశ్రమాన్ని బ్రెజిల్ లాగా విడతల వారీగా అమలు చేసి ఉంటే బాగుండేది. ప్రభుత్వం దీన్ని ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అంటూ నరేష్ పోస్ట్ లో రాసుకోవచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇథనాల్ విధానంపై నరేష్ అభ్యంతరాలు
బీజేపీలో పని చేసిన నాయకుడిగా.. పార్టీకి ప్లాన్ ఏ, బీ అండ్ సీ లతో కూడిన బలమైన కొన్ని పరిష్కార మార్గాలు ఉంటాయని తెలుసు.. కోట్లాది మంది ప్రజల నష్టాన్ని పణంగా పెట్టి పర్యావరణాన్ని రక్షించాలనే ఈ నిర్ణయం సరైనది కాదు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుంది అని నరేష్ అంటున్నారు.. ప్రజలను ఇబ్బంది పట్టేలా ఏ పని చేయడం మంచిది కాదు అంటూ బిజెపి ప్రభుత్వానికి ఒకరకంగా నరేష్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన తన పోస్టు ద్వారా కమలనాథులకు చెప్పే ప్రయత్నం చేశారు.. ప్రజల అవసరాలని తగ్గట్లుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు మళ్ళీ బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముతారు. ఈ ప్రభుత్వంపై ఇప్పటికే వ్యతిరేకత కొనసాగుతుంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్న ఆలోచించి తీసుకోవడం మంచిది అంటూ నరేష్ ఇండైరెక్టుగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నరేష్ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. మరి ఈ సమస్యపై బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది సస్పెన్స్ గా మారింది..
బీజేపీపై నరేష్ ఆగ్రహానికి కారణం
I am not anti national but this ethanol Petrol is giving heart attacks from bike users to high-end car users . My friend( a sympathiser of BJP) who bought Toyota Camry recently had to change valves of the engine. Which cost him 3.5 lks . If the same happens to my new Porsche… pic.twitter.com/4ciFCJxRv4
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) July 19, 2026
నరేష్ లేవనెత్తిన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఎలా స్పందిస్తాయో చూడాలి. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న నరేష్ వాదన చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.


