
📌 Key Points
- నరేష్ పుట్టినరోజు వేడుకల్లో పవిత్ర లోకేష్ ఎమోషనల్ స్పీచ్ వైరల్
- 54 ఏళ్ల నరేష్ సినీ ప్రయాణం.. ఆయనతో జీవితం పంచుకోవడం అదృష్టమన్న పవిత్ర
- కన్నడ అమ్మాయిని.. తెలుగులో మాట్లాడటానికి నరేష్ కారణమంటూ కామెంట్
- పవిత్ర నాలో సగం.. తనే నా లక్కీ ఛామ్ అని నరేష్ కామెంట్స్
టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న నరేష్, పవిత్రల జంట గురించి ఒక షాకింగ్ న్యూస్! వీరిద్దరి బంధం గురించి ఎన్నో రూమర్లు వస్తున్నా, తాజాగా పవిత్ర చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం రండి!
పవిత్ర ఎమోషనల్ స్పీచ్ తో కదిలిపోయిన నరేష్
Naresh : సీనియర్ నటుడు నరేష్ – నటి పవిత్ర లోకేష్ కొన్నాళ్లుగా కలిప్స్ జీవిస్తున్నారు. ఈ జంట వారి బంధాన్ని అధికారికంగానే ప్రకటించి అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి సినిమా ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు. రేపు నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మెయిన్ లీడ్ లో కన్నడ – తెలుగు భాషల్లో కొత్త సినిమాని ప్రకటించారు.(Naresh)
నరేష్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న శుభకృత్ నామ సంవత్సరం అనే కొత్త సినిమాని ప్రకటిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి నరేష్ – పవిత్ర జంటగా హాజరయ్యారు.
54 ఏళ్ల సినీ ప్రయాణంపై పవిత్ర ప్రశంసలు
ఈ ఈవెంట్లో పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో 54 ఏళ్ళు ఆయనకు. అలాంటి ఒక ఆర్టిస్ట్ తో నా జీవితం గడపడం అనేది నా అదృష్టం, దేవుడి బ్లెస్సింగ్ అది. ఆయన ప్రతి పాత్రకు ఒకేలా చాలా ప్రిపేర్ అయి కష్టపడతారు. నేను ఆయనతో మాట్లాడాలంటే టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆయన అంత బిజీగా ఉన్నారు. రోజు మొత్తంలో నాకు ఒక అరగంట దొరుకుతుందేమో ఆయనతో మాట్లాడటానికి. ఇంత పెద్ద నటుడితో కలిసి జీవిస్తున్నాను అని నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
హ్యాపీ బర్త్ డే మీకు. నాతో మీరు మరింత మంచి లైఫ్ మీరు గడపాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు మరిన్ని మంచి సినిమాలు చేయాలి. ఆయన ఒక రాజులా బతుకుతాడు. ప్రతి క్షణం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనే బతుకుతారు. నేను కన్నడ అమ్మాయిని. కన్నడ ప్రొడ్యూసర్ ఇక్కడ తెలుగులో ఈయనతో సినిమా చేస్తున్నారు. కన్నడ, తెలుగులో చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను తెలుగులో బాగా మాట్లాడటానికి నరేష్ గారే కారణం అని చెప్పడంతో పవిత్ర మాటలకు నరేష్ ఎమోషనల్ అయి ఆమెను దగ్గరికి తీసుకున్నారు.
నరేష్ నా లక్కీ ఛామ్.. పవిత్ర కామెంట్స్ వైరల్
ఇక నరేష్ ఈ ఈవెంట్లో పవిత్ర గురించి మాట్లాడుతూ.. నాలో సగం పవిత్ర, నా లక్కీ చామ్ తను అని తెలిపారు.
నరేష్, పవిత్రల బంధం గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. వారి కొత్త సినిమా విశేషాలు త్వరలోనే మీ ముందుకు వస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ ని ఫాలో అవ్వండి.


