
జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ సినిమా ట్రైలర్ విడుదలైంది. జూన్ 6న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి.
Key Points
నార్నే నితిన్ హీరోగా నటించిన 'శ్రీశ్రీశ్రీ రాజావారు' సినిమా ట్రైలర్ విడుదల
జూన్ 6న థియేటర్లలో సినిమా విడుదల కానుంది
సిగరెట్ అలవాటు, ప్రేమకథ నేపథ్యంగా సినిమా కథాంశం సాగుతుంది
'థగ్ లైఫ్' సినిమాతో పోటీలో 'రాజావారు' విజయం సాధిస్తుందా?
‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ సినిమా విడుదల తేదీ
జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. ఇప్పటికే హీరోగా మూడు సినిమాలు చేశాడు. అవే ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’, ‘ఆయ్’. అయితే ఇతడు పరిచయ చిత్రం మాత్రం వాయిదాలు మీద వాయిదాలు పడుతూనే ఉంది. అప్పుడెప్పుడో 2022లో లాంచ్ చేశారు. ఇన్నాళ్లకు దానికి మోక్షం కలిగింది. జూన్ 6న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
సినిమా కథాంశం: ప్రేమ, సిగరెట్ అలవాటు
‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ పేరుతో తీసిన ఈ సినిమాలో నార్నే నితిన్‌తో పాటు రావు రమేశ్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీశ్ వేగ్నేశ దర్శకుడు. తాజాగా రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ పల్లెటూరి కుర్రాడు. ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. కానీ సిగరెట్ అలవాటు వల్ల ఇతడి జీవితంలో ఎక్కడలేని కష్టాలన్నీ వస్తాయి. చివరకు ఏమైంది? హీరో సిగరెట్ అలవాటు మానేశాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.
‘థగ్ లైఫ్’ తో పోటీ
విజువల్స్ చూస్తుంటే రిచ్‌గా ఉన్నాయి గానీ ట్రైలర్ మాత్రం అంతంత మాత్రంగానే అనిపించింది. ప్రమోషన్స్ మీద మాత్రం టీమ్ అస్సలు దృష్టి పెట్టలేదు. మరి కారణాలేంటో వాళ్లకే తెలియాలి. వచ్చే వారం థియేటర్లలో కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ మూవీ రిలీజ్ కానుంది. దీనిపై కాస్తోకూస్తో హైప్ ఉంది. మరి దీంతో పోటీపడి ‘రాజావారు’ మూవీ ఏం చేస్తుందో చూడాలి?
చివరగా, ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ సినిమా విజయవంతం అవుతుందో లేదో చూడాలి. ‘థగ్ లైఫ్’ తో పోటీలో దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.


