|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టీసీఎస్ లవ్ జిహాద్ కేసు: ఐటీలో ప్రకంపనలు! బీఫ్ తిను, మతం మార్చుకో అంటే షాక్!

Published: 15-04-2026, 7:35 AM
టీసీఎస్ లవ్ జిహాద్ కేసు: ఐటీలో ప్రకంపనలు! బీఫ్ తిను, మతం మార్చుకో అంటే షాక్!
  • నాసిక్ టీసీఎస్ బ్రాంచ్‌లో లైంగిక వేధింపులు, మత మార్పిడి యత్నాలు కలకలం రేపుతున్నాయి.
  • హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వేధింపులకు గురి చేశారని పోలీసులు గుర్తించారు.
  • హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ అమ్మాయిలను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసేదని ఆరోపణలు.
  • బాధితురాలు తన ఇంట్లోని దేవుళ్ళ ఫోటోలను తీసివేయడంతో కుటుంబంలో గొడవలు జరిగాయి.

దేశంలో లవ్ జిహాద్ మరోసారి కలకలం రేపుతోంది. టీసీఎస్ నాసిక్ బ్రాంచ్‌లో వెలుగు చూసిన లైంగిక వేధింపులు, మత మార్పిడిల పర్వం ఐటీ రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

టీసీఎస్ నాసిక్ బ్రాంచ్‌లో లవ్ జిహాద్ కలకలం

దేశంలో మరోసారి లవ్ జిహాద్ (Love Jihad) తీవ్ర కలకలం రేపుతోంది. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా అంతా కలగూర గంపలా ఉంటారనే ఐటీ సెక్టార్‍లోకి ఈ నీచ సంస్కృతి పడగవిప్పడం ప్రకంపనలు సృష్టిస్తోంది. టీసీఎస్ సంస్థ నాసిక్ బ్రాంచ్‍లో (TCS Nashik) వెలుగు చూసిన లైంగిక వేధింపులు, మత మార్పిడిల పర్వం వెనుక నిందితులు ఓ ప్రణాళిక ప్రకారం హిందూ అమ్మాయిలను వేధింపులకు గురి చేశారనే విషయాలు ఇప్పుడు అందరిని షాక్‍కు గురి చేస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు నిందితుల నేర విధానం తెలుసుకుని విస్తుపోయినట్లు తెలుస్తోంది. టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఇంత పెద్ద వ్యవహారం జరిగిందంటేనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐటీ సెక్టార్ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది.

నాసిక్ క్యాంపస్‍లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోకి తన సహోద్యోగిపై ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి పేరుతో మోసిగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు మరో ఏడుగురు మహిళలు ముందుకు వచ్చి తమను లైంగికంగా వేధించడంతో పాటు మతమార్పిడికి ఒత్తిడి చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్ఆర్ మేనేజర్ సహా ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు ఉన్నత స్థానంలో ఉంటూ ఓ టార్గెటెట్ గా పని చేస్తున్న నిందితుల ముఠా దారుణాలు వెలుగు చూశాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. నిందితులు ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌లా పనిచేశారని ఇందులో కంపెనీలోని సీనియర్ స్టాఫ్ మెంబర్లతో పాటు ఒక హెచ్ఆర్ (HR) మేనేజర్ కూడా కీలకంగా వ్యవహరించారు. వీరంతా ఆర్థికంగా వెనుకబడిన వారు, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న వారు, అత్యవసరంగా డబ్బు అవసరమైన వారిని తమ టార్గెట్ గా ఎంచుకున్నట్లు గుర్తించారు.

హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసిన నిందితులు

ట్రైనింగ్ సమయంలో నిందితులు కావాలనే హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారని వారి మాటలతో అభ్యర్థులు కలత చెందినప్పుడు నిందితుల్లో ఒకరైన హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ వారి వద్దకు వెళ్లి ఓదార్పు నటిస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకునేలా డ్రామా ఆడేవారని తెలుస్తోంది. ఆ తర్వాత మెల్లమెల్లగా వారిని మతం మార్చుకోవాలని, జీవనశైలి, వస్త్రధారణ మార్చుకోవాలని హెచ్ఆర్ మేనేజర్ ఒత్తిడి చేసేవారని తెలుస్తోంది. ఒక బాధితురాలు నిందితుల ప్రభావంతో ఏకంగా తన ఇంట్లోని దేవుళ్ల ఫోటోలను కూడా తొలగించి కుటుంబంతో గొడవ పడినట్లు విచారణలో తేలిందంటే వారి ట్రాప్ ఏ రేంజ్‍లో ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.

ఈ దారుణాన్ని బట్టబయలు చేసేందుకు పోలీసులు సినిమా ఫక్కీలో ఆపరేషన్ నిర్వహించారు. మహిళా కానిస్టేబుళ్లు హౌస్ కీపింగ్ స్టాఫ్ వేషంలో టీసీఎస్ కార్యాలయంలోకి ప్రవేశించి వారి ద్వారా సమాచారాన్ని సేకరించి, ఆరోపణలు నిజమేనని నిర్ధారించుకున్నాకే ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారూఖ్ ఖురేషి సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

మత మార్పిడికి ఒత్తిడి చేసిన హెచ్ఆర్ మేనేజర్

నిందితులు ఎవరిని టార్గెట్ చేయాలి? ఎవరిని ఎలా మార్చాలి? అనే విషయాలను చర్చించుకోవడానికి ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపును కూడా నిర్వహించినట్లు ఎస్ఐటీ (SIT) గుర్తించింది. దీనితో పాటు కంపెనీలో జరిగిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కూడా పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

టీసీఎస్ లవ్ జిహాద్ కేవలం మతమార్పిడే కాదని అంతకంటే దారుణాలు ఉన్నాయని తెలుస్తోంది. అమ్మాయిల పర్సనల్ ఫోటోలు, వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేశారని, బీఫ్ తినాలని ఒత్తిడి చేశారని, సహకరిస్తే ప్రమోషన్లు, విషయం బయటకు చెబితే కెరీర్ నాశనం చేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఐటీ సెక్టార్ లో వెలుగు చూసిన ఈ లవ్ జీహాద్ కేవలం నాసిక్ వరకే పరిమితం అయిందా లేక ఈ ముఠా ఇంకా ఏయే క్యాంపస్ లో తిష్ట వేసిందనేది అందరిని టెన్షన్ పెట్టిస్తోంది.

టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.