|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ హవా.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?

Published: 01-08-2025, 10:49 AM
జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ హవా.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?

తాజాగా ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు సినిమాలు అద్భుతమైన విజయం సాధించాయి. బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాతో సహా అనేక చిత్రాలు అవార్డులను దక్కించుకున్నాయి. ఈ విజయం తెలుగు సినిమాకు గొప్ప గౌరవం.

Key Points

1

జాతీయ అవార్డుల్లో టాలీవుడ్‌కు ఏడు అవార్డులు!

2

బాలకృష్ణ 'భగవంత్ కేసరి' ఉత్తమ చిత్రంగా ఎంపిక

4

'గాంధీ తాత చెట్టు' చిత్రంలో నటించిన సుకృతి వేణి బండ్రెడ్డి ఉత్తమ బాలనటి అవార్డు గెలుచుకుంది

టాలీవుడ్ సినిమాలకు అవార్డుల వరద

తాజాగా ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి . టాలీవుడ్ ‌ ఇండస్ట్రీకి మొత్తం ఏడు అవార్డులు దక్కాయి . తెలుగులో ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ మూవీ భగవంత్ కేసరి ఎంపికైంది . ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చి హనుమాన్ ‌ రెండు అవార్డులు దక్కించుకుంది . ఉత్తమ యాక్షన్ ‌ కొరియోగ్రఫీతో పాటు ఉత్తమ యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలోనూ అవార్డ్ ‌ సాధించింది .

ఆ తర్వాత వేణు యెల్దండి తెరకెక్కించిన రూరల్ ఎమోషనల్ చిత్రం బలగం ఉత్తమ సాహిత్యం విభాగంలో అవార్డ్ దక్కించుకుంది . ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతమందించారు . ఈ చిత్రంలోని ఊరు పల్లెటూరు అనే పాటకు లిరిక్స్ ‌ అందించిన కాసర్ల శ్యామ్‌కు అవార్డు దక్కింది.

సాయి రాజేశ్ ‌ డైరెక్షన్ ‌ లో వచ్చిన ప్రేమకథా చిత్రం బేబీకి రెండు అవార్డులు దక్కాయి . ఉత్తమ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు సాయి రాజేశ్‌ను జాతీయ అవార్డు వరించింది. ఈ సినిమాలోని ప్రేమిస్తున్నా’ పాట పాడిన పీవీఎన్ ‌ ఎస్ ‌ రోహిత్ ‌ కు ఉ ‍ త్తమ సింగర్ ‌ అవార్డ్ దక్కింది . అలాగే సుకుమార్ కూతురు నటించిన గాంధీతాత చెట్టు చిత్రానికి గానూ ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి బండ్రెడ్డి జాతీయ అవార్డుకు ఎంపికైంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించింది.

తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు

ఏ చిత్రాలు గెలుచుకున్నాయి?

ఉత్తమ తెలుగు చిత్రం – భగవంత్ కేసరి ( అనిల్ రావిపూడి )

ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ – హనుమాన్

ఉత్తమ యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ – హనుమాన్

ఉత్తమ స్క్రీన్‌ప్లే – బేబీ ( సాయి రాజేశ్ )

ఉత్తమ నటులు, దర్శకులు

ఉత్తమ గాయకుడు – బేబీ ( పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ )

ఉత్తమ సాహిత్యం – కాసర్ల శ్యామ్ ( బలగం )

ఉత్తమ బాలనటి – సుకృతి వేణి బండ్రెడ్డి(గాంధీ తాత చెట్టు)

మొత్తం మీద, 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు సినిమా పరిశ్రమ సత్తా చాటుకుంది. భవిష్యత్తులో మరింత మెరుగైన చిత్రాలను అందించాలని ఆశిద్దాం.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.