
71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో టాలీవుడ్ సినిమాలు సత్తా చాటుకున్నాయి. హనుమాన్, బేబీ సినిమాలు అవార్డులను అందుకున్నాయి. కానీ, వాటికి లభించిన ప్రైజ్ మనీ మాత్రం భిన్నంగా ఉంది.
Key Points
హనుమాన్ సినిమాకు రెండు జాతీయ అవార్డులు, దర్శకుడు ప్రశాంత్ వర్మకు రూ.3 లక్షలు ప్రైజ్ మనీ.
బేబీ సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు, దర్శకుడు రూ.1 లక్ష పంచుకోవల్సి ఉంటుంది.
బేబీ సినిమా పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు, రూ.2 లక్షలు ప్రైజ్ మనీ.
గాంధీతాత చెట్టు సినిమాలో సుకృతి ఉత్తమ బాలనటి అవార్డు, రూ.2 లక్షలు మూడుగురు పంచుకుంటారు.
హనుమాన్ సినిమాకు అవార్డుల వరద
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో టాలీవుడ్ హవా కనిపించింది. 71వ జాతీయ సినీ అవార్డుల్లో (National Film Awards 2025) టాలీవుడ్ ఏడు పురస్కారాలను ఎగరేసుకుపోయింది. 2023లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ అవార్డులు ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ నిలవగా.. ఉత్తమ నటుడిగా షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్) అవార్డులు కొల్లగొట్టారు.
అయితే వీరిద్దరూ రూ.2 లక్షల పురస్కారాన్ని చెరిసగం పంచుకోవాల్సి ఉంది. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకుగానూ రాణీ ముఖర్జీకి ఉత్తమ నటి పురస్కారం వరించింది. అవార్డుతో పాటు రూ.2 లక్షలు అందుకోనుంది. వీళ్లందరికీ ఇదే తొలి జాతీయ అవార్డు కావడం విశేషం! తెలుగు చలనచిత్రసీమకు ఏయే విభాగంలో జాతీయ అవార్డులు వచ్చాయి? వారికి ఎంత ప్రైజ్‌మనీ అందుతుందనే వివరాలను చూసేద్దాం..
బేబీ సినిమాకు ప్రైజ్ మనీ వివరాలు
వారికి బంగారు పతకం 2024 సంక్రాంతికి విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘హను–మాన్’ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్), బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ) విభాగంలో పురస్కారాలు వచ్చాయి. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు, యానిమేటర్ జెట్టి వెంకట్ కుమార్‌కు బంగారు పతకంతో పాటు రూ.3 లక్షల నగదు చొప్పున అందజేయనున్నారు. జెట్టి వెంకట్ కుమార్.. వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌గానూ వ్యవహరించినందున అతడికి మరో వెండి పతకంతో పాటు మరో రూ.2 లక్షలు ఇవ్వనున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ నందు పృథ్వీ వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు తీసుకోనున్నాడు.
బేబీ సింగర్‌కు రూ.2 లక్షలు ‘గాంధీతాత చెట్టు’ సినిమాకుగాను సుకృతికి ఉత్తమ బాలనటి పురస్కారం వరించింది. అయితే ఈ కేటగిరీలో మరో ఇద్దరికి అవార్డులు రావడంతో.. రూ.2 లక్షల ప్రైజ్‌మనీని ఈ ముగ్గురూ సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. బేబీ మూవీలో ప్రేమిస్తున్నా… పాటకు పీవీఎస్‌ఎన్ రోహిత్‌కు ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు వరించింది. ఇతడికి వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు రానున్నాయి.
ఇతర తెలుగు సినిమాలకు అవార్డులు
బేబీ డైరెక్టర్‌కు రూ.1 లక్ష ప్రైజ్‌మనీ బెస్ట్ స్క్రీన్‌ప్లే విభాగంలో బేబీ రచయిత సాయి రాజేశ్‌తో పాటు మరో తమిళ దర్శకుడికి అవార్డు వరించింది. దీంతో అతడితో కలిసి రూ.2 లక్షల బహుమానాన్ని సమంగా పంచుకోవాల్సి ఉంటుంది. వీరికి వెండి పతకాలు బహుకరిస్తారు. బలగం సినిమాలో ‘ఊరు పల్లెటూరు..’ పాట రచయిత కాసర్ల శ్యామ్ బెస్ట్ లిరిక్ రైటర్‌గా వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు అందుకోనున్నాడు. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. షైన్ స్క్రీన్స్ నిర్మాతలతో దర్శకుడు అనిల్ రావిపూడి రూ.2 లక్షల ప్రైజ్‌మనీని సమానంగా పంచుకోనున్నాడు.
71వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాకు మంచి గుర్తింపు లభించింది. అయితే, అవార్డుల ప్రైజ్ మనీ విషయంలో తేడాలు కనిపించాయి.


