|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో ‘బ్లైండ్ స్పాట్’ – నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్

Published: 12-06-2025, 3:30 AM
ఓటీటీలో 'బ్లైండ్ స్పాట్' - నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్

టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర నటించిన ‘బ్లైండ్ స్పాట్’ అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. రాశీ సింగ్ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.

Key Points

1

నవీన్ చంద్ర, రాశీ సింగ్ జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'బ్లైండ్ స్పాట్'

2

మే 9న విడుదలైన ఈ చిత్రం జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

4

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాతో ఆకట్టుకునే సినిమా

బ్లైండ్ స్పాట్ కథాంశం

టాలీవుడ్ హీరో నవీన్‌ చంద్ర (Naveen Chandra), రాశీసింగ్‌ (Rashi Singh) జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రం ‘బ్లైండ్ స్పాట్'(Blind Spot). తాజాగా ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది.  మే 9న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్‌ కాకపోయినప్పటికీ క్రైమ్ కథలను ఇష్టపడే వారిని మెప్పించింది. ఈ సినిమాకు రాకేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మించారు. ఈ మూవీలో  ఆలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ తదితరులు నటించారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

‘బ్లైండ్ స్పాట్’ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. జూన్‌ 13 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందని అందులో తెలిపారు. ఈ చిత్రంలో ఒక పాత్రే రెండు విభిన్న కోణాల్లో చాలా  ఆసక్తిగా దర్శకుడు చూపారు. కథ రొటీన్‌గానే ఉన్నప్పటికీ  క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అక్కడక్కడ పండుతుంది. ఓటీటీలో చూడతగిన సినిమానే అని చెప్పవచ్చు.

ఓటీటీ విడుదల వివరాలు

కథ ఏంటి..? హైదరాబాద్‌కు చెందిన మెన్ జైరాం (రవి వర్మ) ప్రముఖ వ్యాపారవేత్తగా ఉంటాడు. అయతే, తన భార్య దివ్య (రాశీ సింగ్)తో తరుచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమె అనుమానాస్పదంగా మరణిస్తుంది. అది హత్య లేక ఆత్మహత్యనా అనేది అంతుపట్టదు. దివ్య మరణించిన విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారం ఇస్తుంది. అప్పుడు ఆ ఏరియా పోలీస్ విక్రమ్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది.  ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని విక్రమ్‌ చెబుతాడు. మరి ఆ హత్యకు కారణాలు ఏంటి..? ఎవరు చేశారు..? ఆమెను చంపే అంత అవసరం ఎందుకు వచ్చింది..? ఇంట్లో ఉన్నవారితోనే ప్లాన్‌ వేశారా..? దివ్య మానసిక పరిస్థితి  ఎలా ఉండేది? చివరికి హత్య చేసిన వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు..? అనేది తెలియాలంటే ‘బ్లైండ్ స్పాట్’ చూడాల్సిందే.

మొత్తం మీద, ‘బ్లైండ్ స్పాట్’ క్రైమ్ థ్రిల్లర్ ప్రేమికులకు ఆసక్తికరంగా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.