
నవీన్ పోలిశెట్టి తన హాస్యనటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి సినిమాతో పోటీ పడుతోంది.
Key Points
నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ 2026 సంక్రాంతికి విడుదల.
మెగాస్టార్ చిరంజీవి సినిమాతో పోటీలో ‘అనగనగా ఒక రాజు’.
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించారు.
ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందుతోంది.
‘అనగనగా ఒక రాజు’ రిలీజ్ డేట్
Naveen Polishetty : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలతో హిట్స్ కొట్టి అందర్నీ నవ్వించి బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఇటీవల నవీన్ కి ఒక యాక్సిడెంట్ అవ్వడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ తర్వాత నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో రాబోతున్నాడు.
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా అనగనగా ఒక రాజు సినిమా తెరకెక్కుతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో మారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా అనగనగ ఒక రాజు సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమాని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. 2026 జనవరి 14న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.
సంక్రాంతి బరిలో పోటీ
అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా ఉంది. వీరిద్దరి కాంబో అంటే భారీ సినిమా, భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రతి సంక్రాంతికి మూడు నుంచి నాలుగు పెద్ద సినిమాలే రిలీజ్ అవుతాయి కాబట్టి ఈ సంక్రాంతికి మెగాస్టార్ తో నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు సినిమాతో పోటీగా వచ్చినా కచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అందులోని నవీన్ సినిమా అంటే ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి అందరూ కనెక్ట్ అయిపోతారు.
సినిమా ప్రత్యేకతలు
చివరగా, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధిస్తుందని ఆశిద్దాం. మెగాస్టార్ చిరంజీవి సినిమాతో పోటీ ఉన్నప్పటికీ, ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయం.


