
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ది రాజా సాబ్’ నుంచి ఓ ఆసక్తికరమైన సాంగ్ లీక్ బయటకు వచ్చింది. ఈ లీకైన సన్నివేశాల్లో ప్రభాస్ ఊర మాస్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Key Points
ప్రభాస్ 'ది రాజా సాబ్' సినిమా నుంచి సాంగ్ సన్నివేశాలు లీక్.
ఎర్ర డ్రెస్సులో, కళ్ళజోడుతో ఊర మాస్ లుక్ లో ప్రభాస్.
ఈ లీక్ అయిన సాంగ్ ఐటెం సాంగ్ అయి ఉండొచ్చని ప్రచారం.
మారుతి దర్శకత్వంలో హారర్ నేపథ్యంలో వస్తున్న సినిమా.
ది రాజా సాబ్ సాంగ్ లీక్ వివరాలు
దిశ, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈశ్వర్, రాఘవేంద్ర లాంటి సినిమాలు చేసి ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన బ్రాండ్ పెంచుకున్నాడు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు ది రాజా సాబ్ సినిమాతో ( The Raja Saab) బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ సినిమాను కొత్త సంవత్సరంలోనే అంటే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అలాంటి ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా నుంచి ఓ లీక్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ షూట్ సన్నివేశాలు వైరల్ అయ్యాయి. ఇందులో రెడ్ డ్రెస్ లో ఊర మాస్ లుక్ లో కనిపించాడు ప్రభాస్. కళ్ళజోడు పెట్టుకుని, మంచి ఊపులో కనిపించాడు. ఇది ఐటెం సాంగ్ షూట్ అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. కాగా ఈ సినిమా మారుతి దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హరర్ నేపథ్యంలో రానుంది.
ప్రభాస్ ఊర మాస్ లుక్ వైరల్
సంక్రాంతికి విడుదల కానున్న సినిమా
మొత్తానికి, ‘ది రాజా సాబ్’ నుంచి లీకైన ఈ సాంగ్, ప్రభాస్ మాస్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మారుతి దర్శకత్వంలో హారర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


