|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Navya Nair: పాపం నటి.. మల్లెపూల వల్ల చిక్కుల్లో పడింది

Published: 08-09-2025, 5:44 AM
Navya Nair: పాపం నటి.. మల్లెపూల వల్ల చిక్కుల్లో పడింది

ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విమానాశ్రయంలో ఒక విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొంది. ఆమె బ్యాగ్‌లోని మల్లెపూల కారణంగా ఆమె భారీ జరిమానా కట్టాల్సి వచ్చింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

నవ్య నాయర్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విమానాశ్రయంలో దిగారు.

2

ఆమె బ్యాగులో మల్లెపూలు ఉండటం వల్ల రూ.1.14 లక్షల జరిమానా విధించబడింది.

4

పండ్లు, విత్తనాలు, పూలు తీసుకురావడం నిషిద్ధం.

మెల్బోర్న్ విమానాశ్రయంలో ఘటన

జడకు పెట్టుకున్న మల్లెపూలు.. ప్రముఖ నటిని చిక్కుల్లో పడేశాయి. ఏకంగా రూ.లక్ష ఫైన్ కట్టించేలా చేశాయి. ఈ విషయాన్ని సదరు నటి బయటపెట్టింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగింది?

మలయాళ నటి నవ్య నాయర్.. రీసెంట్‌గా ఓనం సెలబ్రేషన్స్ కోసం ఓ ఈవెంట్‌కి హాజరయ్యేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. అయితే మెల్‌బోర్న్ విమానాశ్రయంలో దిగేటప్పుడు మల్లెపూలని తన బ్యాగులో పెట్టుకుంది. వీటిని చూసి ఎయిర్‌పోర్ట్ అధికారులు.. ఈమెకు 1980 ఆస్ట్రేలియన్ డాలర్స్ జరిమానా విధించారు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.1.14 లక్షలు.

రూ.లక్ష జరిమానా

కఠినమైన బయోసెక్యూరిటీ ఉన్న విమానాశ్రయాల్లో మెల్‌బోర్న్ ఒకటి. పండ్లు, విత్తనాలు, పూలు తీసుకెళ్లడం ఇక్కడ నిషిద్ధం. వీటి వల్ల వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉండటంతోనే అధికారులు ఈ నిబంధన పెట్టారు. ఇది తెలియని నటి నవ్య నాయర్.. తన బ్యాగులో మల్లెపూలు పెట్టేసింది. దాన్ని గుర్తించిన సిబ్బంది.. జరిమానా విధించారు. 28 రోజుల్లోపు ఈ మొత్తం కట్టాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈమెకు చెప్పారు.

బయోసెక్యూరిటీ నిబంధనలు

విమానాశ్రయంలో ఈ తతంగమంతా జరిగిన తర్వాత మెల్‌బోర్న్‌లో ఓనం ఈవెంట్ లో పాల్గొన్న నవ్య నాయర్.. అక్కడ మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టింది. తాను తీసుకువచ్చిన పూలు.. లక్ష రూపాయలు ఖరీదైనవనని ఫైన్ వేసేవరకు తనకు తెలియదని తనపై తానే కౌంటర్ వేసుకుంది.

నవ్య నాయర్ అనుకోకుండా జరిగిన ఈ ఘటన ఆమెకు ఖరీదైన అనుభవంగా మారింది. బయోసెక్యూరిటీ నిబంధనల గురించి అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం అని ఈ ఘటన తెలియజేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.