
స్టార్ హీరోయిన్ నయనతార గురించి విడాకుల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలకు చెక్ పెట్టేందుకు ఆమె తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి పళని స్వామి ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసింది.
Key Points
నయనతార-విగ్నేష్ దంపతులు పళని స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
విడాకుల వార్తల నేపథ్యంలో ఈ పూజలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
భార్యాభర్తలిద్దరూ కలిసి పూజ చేయడం విడాకుల వార్తలకు చెక్ పెట్టినట్లు అనిపిస్తోంది.
సోషల్ మీడియాలో స్పందించకుండా గుడికి వెళ్లి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విడాకుల వార్తలు
స్టార్ హీరోయిన్ నయనతార ( Nayantara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 15 సంవత్సరాలకు పైగా… సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు హీరోయిన్ నయనతార. తెలుగు, తమిళ్, హిందీ ఇలా ఏ భాష అయినా సరే.. ఆమె నటించిన ప్రతి సినిమా హిట్ కావాల్సిందే. అందుకే ఆమెను లేడీ సూపర్ స్టార్ అంటూ ఉంటారు. అయితే అలాంటి హీరోయిన్ నయనతార.. పర్సనల్ లైఫ్ గురించి గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.
తన భర్త విగ్నేష్ శివన్ కు (Vignesh Shivan) హీరోయిన్ నయనతార విడాకులు ఇవ్వబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ గా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ కావడంతో.. విడాకులు అంటూ ప్రచారం చేశారు. పెళ్లి అంటే నరకం అన్న రేంజ్ లో నయనతార పోస్ట్ పెట్టి డిలీట్ చేశారట. అంతలోనే ఆ పోస్టు వైరల్ అయింది.. దింతో విడాకుల అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే ఆ వార్తలకు తాజాగా నయనతార చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.
పళని స్వామి ఆలయ దర్శనం
తన భర్త విగ్నేష్, పిల్లలతో కలిసి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తూ ప్రత్యక్షమైంది నయనతార. పళని స్వామి ఆలయానికి తాజాగా నయనతార దంపతులు వెళ్లారు. ఈ సందర్భంగా… సాష్టాంగ నమస్కారాలు చేస్తూ కనిపించారు. ఇందులో భార్యాభర్తలిద్దరూ ఎంతో క్లోజ్ గా కనిపించారు. దీంతో విడాకుల వార్తకు చెక్ పడినట్లు అయింది. సోషల్ మీడియాలో స్పందించకుండా.. గుడికి దంపతులు ఇద్దరు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని మళ్ళీ చర్చ జరుగుతుంది.
చర్చనీయాంశం
పళని స్వామి వారిని దర్శించుకున్న నయనతార దంపతులు #Nayanthara #PalaniSwamy pic.twitter.com/KN0dlZLHHk
గుడిలో ప్రత్యక్షమైన నయనతార-విగ్నేష్ దంపతులు తమ విడాకుల వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


