|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nayanthara: ఏది చేసినా వివాదమే.. మరోసారి చిక్కుల్లో నయన్!

Published: 10-09-2025, 6:46 AM

లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఆమెపై ‘నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో అనుమతి లేకుండా సినిమా క్లిప్స్ వాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదం హైకోర్టుకు చేరింది.

Key Points

డాక్యుమెంటరీపై వివాదం

లేడీ సూపర్ ‌ స్టార్ ‌ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం మెగాస్టార్ సరసన నటిస్తోంది . అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం టైటిల్ ‌ ను ఇటీవలే మేకర్స్ రివీల్ చేశారు . చిరు బర్త్ ‌ డే సందర్భంగా మెగా టైటిల్ ‌ ను పరిచయం చేశారు . ఈ సినిమాకు మనశంకర వరప్రసాద్ ‌ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది .

అనుమతి లేని క్లిప్స్ వాడటం

అయితే కోలీవుడ్ భామ నయనతారం ఎప్పుడు ఏదో ఓ వివాదంలో చిక్కుకుంటూనే ఉంటోంది . గతంలో చాలాసార్లు వివాదాలకు కేరాఫ్ ‌ గా అడ్రస్ ‌ గా మారిన ముద్దుగుమ్మను మరోసారి ఇబ్బందుల్లో పడింది . గతేడాది నవంబర్ ‌ లో రిలీజైన డాక్యామెంటరీ నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేయిల్ ‌ లో అనుమతి లేకుండా తమ సినిమా క్లిప్స్ వాడారని నిర్మాణ సంస్థ ఏబీ ఇంటర్నేషనల్‌ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది . క్లిప్‌లను తొలగించాలని డిమాండ్ చేస్తూ.. రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని లీగల్ నోటీసు అందజేసినప్పటికీ .. అదే కంటెంట్‌తో డాక్యుమెంటరీ ప్రసారం అవుతోందని ఎబి ఇంటర్నేషనల్ వాదించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్ దాఖలు చేయాలంటూ డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ టార్క్ స్టూడియోస్‌ను ఆదేశించింది. ఇందుకోసం అక్టోబర్ 6 వరకు గడువు ఇ ‍ చ్చింది .

హైకోర్టు విచారణ

టార్క్ స్టూడియోస్ నిర్మించిన నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేల్ నవంబర్ 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కాగా .. గతంలో ఈ డాక్యుమెంటరీ విడుదలైన ధనుశ్ ‌ కు చెందిన వుండర్‌బార్ ఫిల్మ్స్ తమ సినిమా నానుమ్ రౌడీ దాన్ నుంచి సన్నివేశాలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ కోటి రూపాయల నష్టపరిహారం కోరింది. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ డాక్యుమెంటరీపై మరో వివాదం మొదలైంది . కాగా .. 2005 లో వచ్చిన చంద్రముఖి సినిమాలో రజినీకాంత్ , జ్యోతిక , నయనతార కీలక పాత్రల్లో నటించారు .

నయనతార డాక్యుమెంటరీ చుట్టూ మరో వివాదం రేగడంతో ఆమె మళ్ళీ ఇబ్బందుల్లో పడింది. ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.