|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘డియర్‌ స్టూడెంట్స్‌’ అంటూ క్లాస్‌ తీసుకుంటున్న నయనతార

Published: 15-08-2025, 12:16 PM
'డియర్‌ స్టూడెంట్స్‌' అంటూ క్లాస్‌ తీసుకుంటున్న నయనతార

సౌత్ ఇండియన్ స్టార్ నయనతార నటించిన కొత్త సినిమా ‘డియర్ స్టూడెంట్స్’ టీజర్ విడుదలైంది. నివిన్ పౌలీ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘లవ్ యాక్షన్ డ్రామా’ సినిమా విజయవంతమైంది.

Key Points

1

నయనతార, నివిన్ పౌలీ నటించిన 'డియర్ స్టూడెంట్స్' టీజర్ విడుదల

2

జార్జ్ ఫిలిప్ రాయ్, సందీప్ కుమార్ దర్శకత్వం

4

'వల్లభ' సినిమాను గుర్తుచేసే ప్రేమకథ

‘డియర్ స్టూడెంట్స్’ టీజర్ విడుదల

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ నయనతార నటిస్తున్న కొత్త సినిమా ‘డియర్‌ స్టూడెంట్స్‌’ నుంచి టీజర్‌ విడుదలైంది. మలయాళ కథానాయకుడు నివిన్‌ పౌలీ నటిస్తున్న ఈ చిత్రాన్ని జార్జ్ ఫిలిప్ రాయ్, సందీప్ కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.  గతంలో నివిన్‌, నయన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘లవ్‌ యాక్షన్‌ డ్రామా’ మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా విడుదలైన టీజర్‌ కూడా ఆసక్తిగానే ఉంది.

నయనతార, శింబు లీడ్‌ రోల్స్‌లో నటించిన ‘వల్లభ’ (2006) సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో స్టూడెంట్‌ వల్లభ (శింబు),ప్రోఫెసర్‌ స్వప్న (నయనతార) ప్రేమించుకుంటారు. ఇప్పుడు ‘వల్లభ’ సినిమా ప్రస్తావన ఎందుకంటే ఈ తరహాలోనే తనకంటే చిన్న వయస్కుడితో ప్రేమలో పడే కథలా డియర్‌ స్టూడెంట్‌ ఉంది.

నయనతార, నివిన్ పౌలీ జంట

‘వల్లభ’ సినిమాను గుర్తుచేసే కథ

మొత్తంమీద, ‘డియర్ స్టూడెంట్స్’ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. నయనతార మరియు నివిన్ పౌలీల కెమిస్ట్రీ, కథాంశం ఆకర్షణీయంగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.