|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భర్తతో విడాకులు తీసుకోబోతున్న నయనతార అంటూ వార్తలు.. దీనిపై ఆమె రియాక్షన్ ఇదే.. పోస్ట్ వైరల్

Published: 11-07-2025, 12:48 AM
భర్తతో విడాకులు తీసుకోబోతున్న నయనతార అంటూ వార్తలు.. దీనిపై ఆమె రియాక్షన్ ఇదే.. పోస్ట్ వైరల్

ప్రముఖ నటి నయనతార గురించి విడాకుల పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఈ పుకార్లపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్పందించింది. ఆమె స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

నయనతార-విఘ్నేష్ దంపతుల విడాకుల పుకార్లు వైరల్

2

నయనతార తన ఇన్‌స్టా స్టోరీలో ఫోటో షేర్ చేసి పుకార్లను తోసిపుచ్చారు

4

నయనతార గతంలో పెట్టిన పోస్ట్ డిలీట్ చేయడం కలకలం రేపింది

విడాకుల పుకార్లు వైరల్

స్టార్ హీరోయిన్ నయనతార(Nayanathara) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ చిన్నది మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ‘మెగా-157’(Mega-157)లో నటిస్తోంది. ఇక దీనికి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా నయనతార దంపతులు విడిపోనున్నారంటూ కోలీవుడ్‌లో ప్రచారం మొదలైంది. ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ పలు పుకార్లు నెట్టింట షికార్లు చేశాయి. అయితే వీటిపై తాజాగా నయనతార స్పందించారు.

ఈ మేరకు తన భర్త విఘ్నేష్‌ శివన్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. ‘మాపై వచ్చే సిల్లీ న్యూస్‌కి మా రియాక్షన్‌ ఇదే..’ అంటూ అసత్య ప్రచారాలకు చెక్‌ పెట్టేశారు. కాగా కొన్ని రోజుల క్రితం స్వయంగా నయనతార.. ‘తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు..’ అంటూ ఓ పోస్ట్‌ పెట్టారు. అయితే.. ఏమైందో ఏమో.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ పోస్ట్‌ని డిలీట్‌ చేసేశారామె. అయితే.. అప్పటికే ఆ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ విపరీతంగా వైరల్‌ అయిపోయాయి. దీంతో విడాకులు అంటూ ప్రచారం మొదలైంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ ముద్దుగుమ్మ స్పందించి క్లారీటీ ఇచ్చింది.

నయనతార స్పందన

సోషల్ మీడియాలో చర్చ

నయనతార తన భర్తతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసి, విడాకుల పుకార్లను ఖండించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.