|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

NBK 111కి షాక్: బాలయ్య హిస్టారికల్ మూవీ రద్దు! నిర్మాత సడన్ ట్విస్ట్.. కొత్త కథ రెడీ!

Published: 02-01-2026, 6:30 AM
NBK 111కి షాక్: బాలయ్య హిస్టారికల్ మూవీ రద్దు! నిర్మాత సడన్ ట్విస్ట్.. కొత్త కథ రెడీ!
  • బాలయ్య-గోపిచంద్ మలినేని కాంబోలో భారీ అంచనాలతో ప్రారంభమైన NBK 111 హిస్టారికల్ మూవీ రద్దు.
  • అధిక బడ్జెట్, ఎక్కువ సమయం పట్టడం వంటి కారణాలతో నిర్మాత సతీష్ కిలారు వెనక్కి తగ్గారు.
  • చారిత్రక కథను పక్కన పెట్టి, గోపిచంద్ మలినేని బాలయ్యకు కొత్త స్టోరీ లైన్ చెప్పారు.
  • వృద్ది సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మాతగా అదే కాంబోలో కొత్త సినిమా రానుంది.

NBK 111 మూవీపై ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. బాలయ్య, గోపిచంద్ మలినేని కాంబోలో భారీ అంచనాలతో ప్రారంభమైన హిస్టారికల్ ప్రాజెక్ట్ రద్దయినట్లు తెలుస్తోంది. బడ్జెట్, సమయం వంటి కారణాలతో నిర్మాత వెనక్కి తగ్గగా, ఇప్పుడు అదే కాంబోలో కొత్త కథతో సినిమా రానుంది.

ఆగిపోయిన NBK 111 హిస్టారికల్ మూవీ

NBK 111 Movie : వీర సింహా రెడ్డి.. 2023 సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ బాలయ్యకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన గోపిచంద్ మలినేని… రెండో సారి బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు. NBK 111 అనే వర్కింగ్ టైటిల్‌తో 2025 నవంబర్‌లో పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

అదో హిస్టారికల్ మూవీ అని… దాంట్లో మహారాజు పాత్రలో బాలకృష్ణ, రాణి పాత్రలో నయనతార కనిపిస్తారనే క్లారిటీ వచ్చింది. అంతా సవ్యంగా సాగుతున్న టైంలో ఇప్పుడు ఈ NBK 111 మూవీ రద్దు అయిందనే వార్త తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

రద్దుకు కారణాలు, నిర్మాత సతీష్ కిలారు నిర్ణయం

వీరసింహా రెడ్డి మూవీతో సూపర్ హిట్ ఇవ్వడంతో… గోపిచంద్ మలినేనికి బాలయ్య మరో అవకాశం ఇచ్చాడు. ఈ సారి హిస్టారికల్ నేపథ్యంలో సాగే స్టోరీ చెప్పాడు. బాలయ్యకు నచ్చింది. ఈ సినిమాను నిర్మించడానికి వృద్ధి సినిమాస్ బ్యానర్‌తో సతీష్ కిలారు ముందుకు వచ్చాడు. పూజా కార్యక్రమాలు కూడా అయ్యాయి.

అయితే ఇప్పుడు సడన్‌గా ఈ సినిమాపై అందరూ వెనక్కితగ్గినట్టు తెలుస్తుంది. హిస్టారికల్ మూవీ కాబట్టి… సినిమా మేకింగ్‌కు చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే బడ్జెట్ కూడా ఈ మూవీ కథపరంగా చూస్తే కాస్త ఎక్కువగానే అయ్యే అవకాశాలు ఉన్నాయంట. దీంతో ఈ టైంలో ఈ స్టోరీతో సినిమా చేయడ కష్టమే అని… ఆ హిస్టారికల్ స్టోరీని పక్కన పెట్టేయాలని ఫిక్స్ అయ్యారట.

గోపిచంద్-బాలయ్య కాంబోలో రానున్న కొత్త ప్రాజెక్ట్

హిస్టారికల్ కథను పక్కన పెట్టడంతో… బాలయ్యకు గోపిచంద్ మలినేని మరో స్టోరీ లైన్ చెప్పారంట. అది బాలయ్యకు బానే నచ్చిందంట కూడా. ఇప్పుడు గోపిచంద్ మలినేని ఫుల్ స్క్రీప్ట్ రాసే పనిలో ఉన్నారట. ఫుల్ స్క్రిప్ట్ రాసిన వెంటనే… బాలయ్య – గోపిచంద్ మలినేని కాంబోలో మూవీ స్టార్ట్ అవుతుందని సమాచారం. దానికి కూడా వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సితీష్ కిలారే నిర్మాతగా ఉంటారట. దీని తర్వాత… బాలయ్యతో మూడో సినిమా చేయడానికి కూడా తన దగ్గర మరో కథను సిద్ధం చేసుకున్నాడట గోపిచంద్. అయితే.. అది ఇప్పుడే ఉండకపోవచ్చు.

మొత్తానికి NBK 111 హిస్టారికల్ మూవీ ఆగిపోయినా, బాలయ్య-గోపిచంద్ మలినేని కాంబో మాత్రం కొనసాగనుంది. త్వరలోనే కొత్త కథతో వారి తదుపరి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సడన్ మార్పు అభిమానులకు కొంత నిరాశ కలిగించినా, కొత్త సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.