
📌 Key Points
- బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో NBK-111 వర్కింగ్ టైటిల్‌తో భారీ బడ్జెట్ మాస్ సినిమా.
- ‘వీరసింహారెడ్డి’ విజయవంతం తర్వాత ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
- నయనతార రూ.8 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు ఆలోచనలో పడినట్లు వార్తలు.
- బడ్జెట్ తగ్గించుకునేందుకు నయన్ స్థానంలో వేరే హీరోయిన్‌ను తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న NBK-111 ప్రాజెక్టు నుంచి నయనతార తప్పుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. భారీ రెమ్యూనరేషనే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
NBK-111: అంచనాలు, ప్రాజెక్ట్ వివరాలు
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మాస్ సినిమా రూపొందనుంది.’ఎన్.బి.కె 111′(NBK 111) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌తో పాటు భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నయనతార నటిస్తుండగా.. ఈ సారి బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ మలినేని బాలయ్యతో చేయబోయే సినిమాకు స్క్రిప్ట్ దశలోనే భారీ బడ్జెట్ అవుతుందట. దీంతో నిర్మాతలు ముందుగానే జాగ్రత్త పడాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగా మలినేని మళ్లీ తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడట. మరోవైపు నిర్మాతలు కాస్ట్ కటింగ్ పనులు కూడా పెట్టారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ నయనతారని ఈ ప్రాజెక్టు నుండి తప్పించే అవకాశాలు ఉన్నాయట. ఎందుకంటే.. ఈ సినిమా కోసం నయన్ ఏకంగా రూ.8 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. దీంతో ఆమె ప్లేస్‌లో వేరే హీరోయిన్‌ను తీసుకుంటే.. బడ్జెట్ రూ.6 కోట్ల వరకు సేవ్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారట. మరి ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
నయనతార అవుట్ వెనుక అసలు కథ ఏమిటి?
బడ్జెట్ సేవింగ్స్: హీరోయిన్ మార్పుపై చర్చ
NBK-111 బడ్జెట్ కటింగ్ నేపథ్యంలో నయనతార అవుట్ వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.8 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్‌పై చిత్రయూనిట్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


