
మాస్ మహారాజా రవితేజ తన సినిమాలపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చారు. నెగటివ్ రివ్యూలు ఇచ్చే ‘మేధావులు’ థియేటర్లకు వెళ్లరని, కమర్షియల్ సినిమాలు చేయడం సులభం కాదని స్పష్టం చేశారు. OTT ప్రభావంతో ప్రేక్షకుల మైండ్‌సెట్ మారిందని రవితేజ అభిప్రాయపడ్డారు.
Key Points
రవితేజ: నెగిటివ్ రివ్యూలు ఇచ్చే మేధావులు థియేటర్లకు అస్సలు వెళ్లరు.
డిఫరెంట్ ప్రయత్నాలను ప్రేక్షకులు సపోర్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కమర్షియల్ సినిమాలు చేయడం సులభం కాదని, దానికి సరైన కొలమానం కావాలని అన్నారు.
కరోనా తర్వాత OTT కంటెంట్‌కు అలవాటు పడి ప్రేక్షకుల మైండ్‌సెట్ మారిందని అభిప్రాయం.
రవితేజ షాకింగ్ కామెంట్స్: మేధావులు థియేటర్లకు వెళ్లరు
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సూపర్ క్రేజ్ తెచ్చుకుని ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న వారిలో రవితేజ ఒకరు. తనదైన మ్యానరిజం, ఊర మాస్‌తో ఫ్యాన్స్‌ను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్న ఈ మాస్ మహారాజా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు సైన్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రవితేజ సినిమాలు రొటీన్‌గా ఒకే బ్యాక్ డ్రాప్‌లో వస్తున్నాయంటూ నెట్టింట పలు నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తుండగా.. రీసెంట్‌గా దీనిపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ హీరో.
‘ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాల్లో ఎవరు అయితే.. నెగిటివ్ రివ్యూలు ఇస్తుంటారో ఆ మేధావులు థియేటర్లకు అస్సలు వెళ్లరు. జనాలు నన్ను గీతాంజలి లాంటి సినిమాలో చూడరు. నేను డిఫరెంట్‌గా ఏదైనా ప్రయత్నించినప్పుడు ఆ సినిమాలను సపోర్ట్ చేయలేదు. మనం ఏం చేసినా సరే.. ట్విట్టర్ జనాలను కామెంట్స్ చేస్తూనే ఉంటారు. కమర్షియల్ సినిమాలు చేయడం అంత సులభమేమీ కాదు. దీనికి సరైన కొలమానం కావాలి. కరోనా టైమ్‌లో చాలా మంది ఓటీటీ కంటెంట్‌కు అలవాటు పడ్డారు.. అది వారి మైండ్‌సెట్‌ను మార్చేసింది. దీంతో వారిలో కొందరు థియేటర్లకు రారు.. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ప్రజలు గమనిస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు రవితేజ.
కమర్షియల్ సినిమాలపై మాస్ మహారాజా స్పందన
OTT ప్రభావం: ప్రేక్షకుల మైండ్‌సెట్ మార్పు
మొత్తంగా, రవితేజ తన సినిమాల ఎంపికను, థియేటర్ల పరిస్థితిని సమర్థించుకుంటూ, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను ధైర్యంగా వెల్లడించారు. OTT ప్రభావంతో మారిన ప్రేక్షకులను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.


