
‘అఖండ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలకృష్ణకు సంబంధించి NBK111 చిత్రం గురించి అప్డేట్ వచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. వీరసింహారెడ్డి తర్వాత మళ్ళీ ఈ కాంబో కలిసి పనిచేయడంతో అభిమానుల ఆసక్తి పెరిగింది.
Key Points
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో NBK111 సినిమా ప్రకటన.
‘వీరసింహారెడ్డి’ తర్వాత మరోసారి ఈ జంట కలిసి పనిచేస్తున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మాణం.
సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
NBK111 ప్రకటన
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం ‘అఖండ-2’తో బిజీగా ఉన్నాడు. సెన్సేషనల్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా టీజర్ కూడా సోమవారం రాబోతున్నట్లు అనౌన్స్‌మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. బాలకృష్ణ మరో సినిమా అప్‌డేట్ రావడంతో అభిమానుల్లో ఉత్సహం మరింత రెట్టింపు అయింది. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్షన్‌లో బాలకృష్ణ తన ‘NBK111’ సినిమాను చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వం
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘రోరింగ్ బ్లాక్ బస్టర్ కాంబో తిరిగివస్తుంది.. చారిత్రక గర్జన ప్రారంభమవుతుంది’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ పోస్టర్ ప్రజెంట్ వైరల్ అవుతుండగా.. గూస్ బంప్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య, గోపీచంద్ కాంబోలో ఇప్పటికే వచ్చిన ‘వీరసింహరెడ్డి’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో ‘NBK111’పై ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.
భారీ అంచనాలు
THE GOD OF MASSES is back… and this time, we’re ROARING LOUDER! 🦁🔥 Honoured to reunite with #NandamuriBalakrishna garu for our 2nd MASS CELEBRATION together — #NBK111 👑 This one’s going to be HISTORIC! 💥 Backed by the passionate force #VenkataSatishKilaru garu under… pic.twitter.com/1bRWPX83J0
బాలయ్య-గోపీచంద్ కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ తో NBK111 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.


