|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Neeli Neeli Akasham Song Sequel : ఆ సూపర్ హిట్ సాంగ్ కి సీక్వెల్ వచ్చేసింది.. భలే రాసారే..

Published: 24-08-2025, 8:15 AM
Neeli Neeli Akasham Song Sequel : ఆ సూపర్ హిట్ సాంగ్ కి సీక్వెల్ వచ్చేసింది.. భలే రాసారే..

ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాటకు సీక్వెల్ వచ్చింది. ‘బ్యాడ్ గాళ్స్’ సినిమాలోని ‘ఇలా చూసుకుంటానే’ పాటను రానా దగ్గుబాటి విడుదల చేశారు.

Key Points

1

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలోని సూపర్ హిట్ పాట ‘నీలి నీలి ఆకాశం’కు సీక్వెల్!

2

‘బ్యాడ్ గాళ్స్’ సినిమాలో ‘ఇలా చూసుకుంటానే’ అనే కొత్త పాట విడుదల!

4

జమ్మూ కాశ్మీర్, మలేషియాలో షూటింగ్ జరిగింది!

‘నీలి నీలి ఆకాశం’ సీక్వెల్ విడుదల

Neeli Neeli Akasham Song Sequel : గతంలో ప్రదీప్ హీరోగా వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో నీలి నీలి ఆకాశం.. సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఆ సాంగ్ కి సీక్వెల్ అంటూ ఆ సినిమా డైరెక్టర్ మున్నా తన నెక్స్ట్ సినిమాలో ఒక కొత్త పాట రాయించారు. తాజాగా ఆ సాంగ్ ని రిలీజ్ చేసారు.(Neeli Neeli Akasham Song Sequel )

నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్, అప్సర.. పలువురు కీలక పాత్రల్లో మున్నా ధులిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బ్యాడ్ గాళ్స్’. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

‘బ్యాడ్ గాళ్స్’ సినిమా నుంచి కొత్త పాట

తాజాగా ఈ బ్యాడ్ గాళ్స్ సినిమా నుంచి ‘ఇలా చూసుకుంటానే..’ అనే మెలోడీ పాటను రానా దగ్గుబాటి రిలీజ్ చేసారు. నీలి నీలి ఆకాశం సాంగ్ చేసిన టీమ్ ఈ సాంగ్ ని కూడా చేసింది. ఆ సాంగ్ రచయిత చంద్రబోస్ పాట రాయగా అనూప్ రూబెన్స్ అదే ట్యూన్ లో సంగీతం ఇవ్వగా సిద్ శ్రీరామ్ పాడారు. మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ ని వినేయండి..

ప్రకృతి అందాల మధ్య షూటింగ్

ఈ సందర్భంగా మూవీ యూనిట్ మాట్లాడుతూ.. ఈ సాంగ్ ని రానా దగ్గుబాటి రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. నీలి నీలి ఆకాశం.. పాట సీక్వెల్ గా అంతకన్నా గొప్పగా ఉంటుంది. ఈ పాట అంతా జమ్మూ కాశ్మీర్, మలేషియా ప్రకృతి అందాలలో షూట్ చేసాము. ప్రస్తుతం షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాము అని తెలిపారు.

చివరగా, ‘నీలి నీలి ఆకాశం’ సీక్వెల్ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం. ‘బ్యాడ్ గాళ్స్’ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.