
📌 Key Points
- నేపాల్ ఎన్నికల్లో రాష్ట్రయ స్వతంత్ర పార్టీ విజయం సాధించి జెన్-జీ తరం పాలనకు వచ్చింది.
- బాలెంద్ర షా నేతృత్వంలోని ఈ ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీపై ఆధారపడిన యువతరం ఆకాంక్షలకు ప్రతిబింబం.
- అవినీతి రహిత పాలన అందించడం, సాంఘిక సమస్యలను పరిష్కరించడం జెన్-జీ ముందున్న సవాళ్లు.
- కుటుంబ సంబంధాలు, నైతిక విలువలు కాపాడటం, వ్యక్తిగత స్వార్థం తగ్గించడం ఈ తరం బాధ్యత.
నేపాల్‌లో ఒక సంచలనం జరిగింది. రాష్ట్రయ స్వతంత్ర పార్టీ ఎన్నికల్లో గెలిచి జెన్-జీ తరం పాలనను స్థాపించింది. బాలెంద్ర షా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ పరిణామం నేపాల్ రాజకీయాల్లో పెను మార్పులకు సూచనగా కనిపిస్తోంది.
జెన్-జీ పాలన: నేపాల్‌లో కొత్త శకం
నేపాల్‌లో రాష్ట్రయ స్వతంత్ర పార్టీ (123/165) సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. దీనికి నాయకునిగా ఉన్న బాలేంద్ర షా ఇప్పుడు దేశ ప్రధాని. ఈ మార్పులో ప్రధాన భూ మిక జెన్ -జీ. అంటే 1997- 2012 మధ్య జన్మించిన తరం. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇంటర్నెట్, సోషల్ మీడియా, డిజిటల్ టెక్నాలజీతో పెరిగిన తరం. సమకాలీన సవాళ్లను అర్ధం చేసుకొని వేగంగా స్పందించే, సాంకేతికంగా ముందంజలో ఉండే తరం అన్నమాట. చిన్నతనం నుండే స్మార్ట్ ఫోన్‌లు, ఇంటర్నెట్ ఉపయోగించడం, సమయం, భౌగోళిక సరిహద్దులు లేని ప్రపంచంలో జీవించడం, భిన్నమైన ఆలోచనలు, సంస్కృతిలను గౌరవించడం జెన్ -జీ కొత్త ఆలోచనా విధానం.
నేపాల్‌లో అవినీతి రహిత పాలన కోసం ఆరాటపడే తరానికి నిజంగా అధికారం దక్కిందా? ఇది అవినీతి మూల కారణాల పైన, మానవ సంబంధాలను, కార్య కారణ సంభావ్యతను అర్ధం చేసుకోగలదా? సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంతర్గత సంబంధాలతో పాటు ఒకదానిపై ఒకటి ఆధారపడే క్రమాన్ని అర్థం చేసుకున్న తరమేనా అన్నది అసలు ప్రశ్న. పెట్టుబడిదారీ ధనస్వామ్యం జడలు విప్పి సమస్త రంగాల్లో స్వ ప్రయోజన వాద ధోరణి బలపడింది. సొంతంగా ఆస్తులు పోగేసుకునే ఆలోచన పెచ్చు మీరింది. సమాజంలో కుటుంబ సంబంధాలు, సామాజిక జీవన విధానం, మానవీయ సంబంధాలు, నైతిక విలువలు పతనమవుతున్న కాలమిది.) ప్రజాస్వామిక, హింసాత్మక ధోరణులు గత మూడు దశాబ్దాలలో బాగా విస్తరించాయి.
యువతరం ఆకాంక్షలు, సవాళ్లు
సమాజంలో సామాజిక ఆర్థిక అస్వస్థతకు చిహ్నాలు అయిన పేదరికం, ఆకలి, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అవినీతి అభద్రతల పైన పరిష్కార ప్రణాళికలు, భాగస్వామ్యం లేని యువతరం జెన్ జీ. వ్యక్తి స్వార్థ ధోరణులు, కుల జాడ్యం, మతోన్మాదం, జాతుల మధ్య కక్షలు, హింసాత్మక ధోరణులు మితిమీరుతున్న రోజులివి. వ్యక్తి సంపద పెరుగుదల, రాజ్యాంగం దుర్వినియోగం, న్యాయస్థానాలను ప్రభావితం చేసే దుర్మార్గ చర్యలను అర్థం చేసుకుంటుందా! వ్యక్తి సంపద కేంద్రీకరణ లక్ష్యంగా సాగే ప్రపంచంలో సాగే దోపిడీ వ్యాపార, వాణిజ్య సంబంధాలు, అమానవీయ, ఆటవిక వాదంతో ముడిపడి ఉంటాయనే ప్రాథమిక లక్షణాన్ని అర్థం చేసుకోగలుగుతుందా?
జెన్ జీ తరం సోషలిస్ట్ భావాలను గౌరవిస్తున్నట్టు కని పిస్తున్నా, కమ్యూనిస్టు వ్యతిరేక, ఊహాజనిత మానసిక స్థితి కలిగి విలాసవంత జీవితానికి అలవాటపడిన తరమని అర్థం చేసుకోక తప్పదు. నేపాల్, బంగ్లాదేశ్, వెనిజులా దేశాలలో అక్కడి అవినీతి ప్రభుత్వాలను మార్చుతున్న తరం మార్పునకు కారణం, ఘనత జెన్- జీ తరానికే దక్కుతుందని భావిస్తున్నారు. కానీ, సామ్రాజ్యవాద దేశమైన అమెరికా, తమ శత్రువుగా గుర్తించిన వివిధ దేశాలలోని యువతను CIA ద్వారా రహస్యంగా చేరదీసి, నిధులు సమకూరుస్తూ, తిరుగుబాటు శిక్షణా కార్య క్రమాలు నిర్వహిస్తూ యువతను ఉసిగొలిపి, ఆ దేశ పాలనను తమ చెప్పు చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోందని పలువురు విశేషకులు అంటున్నారు.
అవినీతి రహిత పాలన సాధ్యమేనా?
ప్రస్తుతం నేపాల్ విషయానికి వస్తే రాజుల పాలనను, కమ్యూనిస్టు/ మావోయిస్టు భావజాలాన్ని తోసిరాజని స్వేచ్చా ప్రపంచానికి బాటలు వేస్తున్న నవతరంగా జెన్ జీ అవతరించింది. పాలనా వ్యవస్థలో ఇదొక కొత్త ప్రయోగం. ఏ మాత్రం తీరిక, ఓపిక లేని తరం రాజ్య స్వభావాన్ని అర్ధం చేసుకొని, సవాళ్లకు సిద్ధాత పరమైన పరిష్కారాలు కనుగొనగలదా? తిరుగుబాటులో ధ్వంసమైన నేపాల్‌ను పునర్నిర్మించగలదా? ఎన్నికల హామీలను నిలబెట్టుకోగలదా? దీని మనుగడ, భవిష్యత్ పరిణామాలు, ప్రపంచ దేశాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో? ప్రపంచవ్యాప్తంగా కార్పోరేట్ రంగం బహు ముఖంగా విస్తరిస్తున్న తరుణంలో మిగిలిన దేశాలు ఎలా ఆహ్వానిస్తాయో! అనే అంశాన్ని ఆసక్తిగా ఎదురు చూద్దాం!
జెన్-జీ తరం నేపాల్‌లో అధికారంలోకి రావడం ఒక చారిత్రాత్మక పరిణామం. అయితే, వారు అవినీతిని నిర్మూలించి, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారా అనేది వేచి చూడాలి. వారి పాలన దేశానికి ఒక కొత్త దిశను ఇస్తుందని ఆశిద్దాం.



Amitabh Bachchan Admits Mistake After Racism Row Over France Football Team Tweet