|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సెక్స్ ఫోబియా: భర్త ముట్టుకుంటేనే భయం.. పరిష్కారం ఇదే!

Published: 09-07-2026, 3:22 PM
సెక్స్ ఫోబియా: భర్త ముట్టుకుంటేనే భయం.. పరిష్కారం ఇదే!
  • సెక్స్ ఫోబియా వల్ల వివాహిత భర్తతో సంబంధానికి భయపడుతోంది.
  • బాల్యంలో సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం మరియు అపోహలు భయానికి కారణం.
  • లైంగిక వేధింపులు, హింసాత్మక పోర్న్ సైట్లు కూడా ప్రభావం చూపిస్తాయి.
  • మానసిక నిపుణుల సలహా తీసుకోవడం మరియు భర్త సహకారం అవసరం.

23 ఏళ్ల వివాహిత లావణ్య సెక్స్ ఫోబియాతో బాధపడుతోంది. భర్త ముట్టుకుంటేనే భయం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యకు కారణాలు, పరిష్కారాలను నిపుణులు వివరించారు.

సెక్స్ ఫోబియా అంటే ఏమిటి?

మేడమ్.. నాకు వివాహమై సంవత్సరం అవుతుంది. నాకు 23 ఏళ్లు. నా భర్తతో సెక్స్ జీవితం అంటేనే భయంగా ఉంటుంది. ఆయన ముట్టుకుంటేనే చెమటలు పట్టి స్పృహ తప్పినంత పని అవుతుంది. నా భర్త నన్ను ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నాడు. అదే సమయంలో అసంతృప్తితో.. చిరాకు, కోపం ప్రదర్శిస్తున్నాడు. ఇద్దరి ఇళ్లల్లో ఎవరికీ తెలియదు. మా సమస్యకు పరిష్కారం తెలపండి. – లావణ్య కరీంనగర్

జవాబు: అమ్మా.. నీ సమస్యను ‘సెక్స్ ఫోబియా’ అంటారు. అనేక కారణాల వలన ఈ రకమైన భయం ఏర్పడుతుంది. దీనికి నువ్వు నీ వ్యక్తిత్వ వికాస సమయంలో.. బాల్య, కౌమార, యవ్వన దశల్లో ఎలాంటి అనుభవాల మధ్య గడిపావు లేదా నీకు ఈ రకంగా సెక్స్ పట్ల భయం, విముఖత ఏర్పడ్డానికి ఎలాంటి సెక్స్ ఎడ్యుకేషన్ నీకు దొరికింది అనేది ఆలోచించాలి. అశాస్త్రీయమైన, అపోహలతో కూడిన భయం, అసహ్యం కలిగించే సెక్స్ ఎడ్యుకేషన్ వివిధ మాధ్యమాల ద్వారా ఉదాహరణకు స్నేహితురాళ్లు, సినిమాల్లో రేప్, ప్రసవం దృశ్యాలు, హింసాత్మక పోర్న్ సైట్స్, తల్లిదండ్రుల భయాలు ఇవన్నీ అమ్మాయిల్లో పెళ్లి అన్నా, సెక్స్ అన్నా భయాన్ని కలిగిస్తాయి. బాల్యంలో తల్లిదండ్రులు లైంగిక అవయవాలు విధుల పట్ల అంటే.. నెలసరి, టీనేజ్‌లో సెక్స్ హార్మోన్స్ వల్ల మొదలయ్యే సహజమైన శారీరిక మార్పులు మొదలైన వాటి పట్ల నెగెటివ్ ఆలోచనలను పిల్లల ముందు వ్యక్తం చేయడం, సెక్స్ అంటే పాపంగా, నీచంగా భావించడం ఇవన్నీ ఎదుగుతున్న పిల్లల సబ్ కాన్షియస్ మైండ్ మీద బలమైన ప్రభావాన్ని చూపించి సెక్స్ పట్ల ప్రతికూల ఆలోచనలు, భయాలను, అసహ్యాన్ని కలుగజేస్తాయి.

అలాగే తాము అందంగా లేము..భర్తను ఆకర్షించలేము.. అనే నూన్యతా భావన కూడా దీనికి కొద్ది కారణం. బాల్యంలో లైంగిక అత్యాచారాలకు లోనవడం, గర్భం వస్తుందేమో, చదువు కెరీర్ పాడవుతాయేమో లేదా సెక్స్‌లో విపరీతమైన నొప్పి, రక్తస్రావం అవుతుందేమో అనే భయం వల్ల కూడా సెక్స్ ఫోబియాకు లోనవుతారు. నొప్పితో కూడిన తమ తొలి రాత్రి అనుభవాలను స్నేహితురాళ్లతో పంచుకోవడం కూడా పెళ్లి తర్వాత సెక్స్ పట్ల భయాన్ని కలిగిస్తుంది చాలా సార్లు. మానసికంగా డిప్రెషన్, ఆందోళనా పూరిత న్యూరోసిస్‌లతో బాధ పడడం. ఇక భర్త వైపు నుంచి కారణాలు.. భార్యతో శృంగారంలో అసహజ, మోటు, హింసాత్మక పద్ధతులు పాటించడం.

సెక్స్ ఫోబియాకు కారణాలు

గృహ హింస, శారీరక హింస, అవమానించడం.. విపరీతమైన శృంగార ఆసక్తి ఉండడం.. భార్య భయాలు, నొప్పితో సంబంధం లేకుండా ఆమెను పురుషాధిక్యతతో ఒక లైంగిక వస్తువుగా చూస్తూ వేధించడం.

* సెక్స్‌లో తక్కువగా పాల్గొనడం, పూర్తిగా బహిష్కరించడం, చిన్న చిన్న స్పర్శలకు, ముద్దులకు కూడా చెమటలు పట్టి, గుండె దడ పెరిగేంత భయపడటం.

పరిష్కారం: నిపుణుల సలహా

*వాంతులు, విరోచనాలు, స్పృహ తప్పడం, ఏడవడం.

నువ్వు నీ భర్తతో కలిసి sexologist లేదా మారిటల్ థెరపిస్టు&సైకో థెరపిస్టును కలవాలి. సెక్స్ పట్ల నీకున్న భయానికి మూలకారణాలను విశ్లేషించి… సెక్స్ పట్ల, లైంగిక అవయవాలు పనితీరు పట్ల శాస్త్రీయమైన అవగాహన కలిగించి.. భయం పోగొట్టే సైకో థెరపీ, కౌన్సిలింగ్ ఇస్తారు. కారణాలు నీ భర్తలో ఉంటే.. ఆయనకు భార్య పట్ల ఆధిపత్య హింసా ధోరణులను వదిలించే సెక్సువాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు. అతనికి మనోలైంగిక సమస్య ఉంటే చికిత్స ఇస్తారు. ఇద్దరికీ మారిటల్& రిలేషన్ షిప్ థెరపీ చాలా అవసరం.

సెక్స్ ఫోబియా అనేది సాధారణ సమస్య, దీనికి సరైన మానసిక చికిత్స, భర్త సహకారం మరియు సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా పరిష్కారం లభిస్తుంది. భయాన్ని అధిగమించి ఆరోగ్యకరమైన దాంపత్య జీవితాన్ని గడపడం సాధ్యమే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.