|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంచలనం: నేను బతికే ఉన్నా..నెతన్యాహు సంచలన వీడియో విడుదల! ఇరాన్ కి షాక్!

Published: 17-03-2026, 4:35 PM
సంచలనం: నేను బతికే ఉన్నా..నెతన్యాహు సంచలన వీడియో విడుదల! ఇరాన్ కి షాక్!
  • ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
  • ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారన్న ఇరాన్ ప్రకటనను ఆయన ఖండించారు.
  • తాను బతికే ఉన్నానని నెతన్యాహు మరో వీడియో విడుదల చేశారు.
  • అమెరికా రాయబారి ట్రంప్ ఆదేశాల మేరకు నెతన్యాహు క్షేమ సమాచారాలు కనుక్కున్నట్లు తెలిపారు.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరణించారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను బతికే ఉన్నానని ఆయన వీడియో విడుదల చేశారు.

యుద్ధ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. హ‌ర్ముజ్ జల సంధి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇండియా లాంటి చాలా దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ ఈ మూడు దేశాలు మాత్రం యుద్ధంలో ఏమాత్రం తగ్గడం లేదు. అయితే ఈ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం ఖ‌మేనీ ఇప్పటికే మరణించారు. అయినప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అయితే దానికి ప్రతికారంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెత‌న్యాహును చంపేసినట్లు ఇరాన్ వెల్లడించింది.

నెతన్యాహు మరణంపై ఇరాన్ ప్రకటన

కానీ తాను చనిపోలేదని ఇప్పటికే రెండు వీడియోలు విడుదల చేసిన బెంజమిన్ నెత‌న్యాహు, తాజాగా మూడో వీడియోను రిలీజ్ చేసి ఇరాన్ కు షాక్ ఇచ్చాడు. మీరు ఎలా ఉన్నారో కనుక్కోమని ట్రంప్ ఆదేశించారని, అమెరికా రాయబారి మైక్ హుకబీ నవ్వుతూ అడిగినట్లు ఈ వీడియో రిలీజ్ చేశారు. ఇక దానికి బెంజమిన్ నెత‌న్యాహు తన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చారు. అవును మైక్.. నేను ఇంకా బతికే ఉన్నాను, చనిపోలేదని క్లారిటీ ఇచ్చారు బెంజమిన్ నెత‌న్యాహు. మనం ప్రతి చేతికి 5 వేళ్ల‌ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలని, 6 వేళ్ల‌ రూమర్లకు చెక్ పెడుతూ కౌంటర్ ఇచ్చారు. అయితే, ఇది కూడా ఏఐ వీడియోనే అంటూ ఇరాన్ చెబుతోంది.

తాను బతికే ఉన్నానంటూ నెతన్యాహు వీడియో

Crossing names off the list is good – doing it shoulder to shoulder with our American friends is even better. Good to see Ambassador @GovMikeHuckabee . Always a pleasure. 🇮🇱🇺🇸 pic.twitter.com/FZrZN03IZI

నెతన్యాహు విడుదల చేసిన ఈ వీడియో ఇరాన్ వాదనలకు చెక్ పెట్టింది. అయితే ఇది ఏఐ వీడియో అని ఇరాన్ కొట్టిపారేస్తోంది. ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.