
📌 Key Points
- ఇరాన్‌తో యుద్ధం జరుగుతోందని, త్వరలో గెలుస్తామని నెతన్యాహు ప్రకటన
- అమెరికాను యుద్ధంలోకి లాగలేదని, ఇరాన్‌ను రెండు దేశాలు టార్గెట్ చేశాయని వివరణ
- ట్రంప్ స్ట్రాటజీ చాలా స్పెషల్ అని నెతన్యాహు ప్రశంస
- తన మరణంపై తప్పుడు ప్రచారాలు ఆపాలని నెతన్యాహు విజ్ఞప్తి
ఇరాన్‌తో జరుగుతున్న భయంకరమైన యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. తాము త్వరలోనే విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా అమెరికా పాత్రపై కూడా ఆయన స్పందించారు.
ఇరాన్‌పై త్వరలో విజయం సాధిస్తాం: నెతన్యాహు
ఇరాన్ తో భయంకరమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాశనం అయిందని.. తాము గెలవబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. అందరూ అనుకున్న దాని కంటే ముందు తాము యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. అమెరికాను తాము యుద్ధంలోకి లాగలేదని.. రెండు దేశాలు కలిసే ఇరాన్ ను టార్గెట్ చేశాయని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ట్రంప్ ఏం చేయాలనేది ఆయనకు ఎవరైనా చెప్పగలరా ? ఆయన స్ట్రాటజీ చాలా స్పెషల్ అని ప్రశంసించారు. తాను బతికే ఉన్నానని మరోసారి చెబుతున్నా… దీనికి మీరే సాక్ష్యం అంటూ మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇకపై తన మరణంపై తప్పుడు ప్రచారాలు ఆపాలని కోరారు.
A post shared by Kuwait Times (@kuwaittimes)
అమెరికాను యుద్ధంలోకి లాగలేదు: నెతన్యాహు స్పష్టీకరణ
నా మరణ వార్తలపై దుష్ప్రచారం ఆపండి: నెతన్యాహు
నెతన్యాహు ప్రకటనలు ఇజ్రాయెల్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

