
📌 Key Points
- నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
- ఈ భారీ డీల్ విలువ దాదాపు 72 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6.47 లక్షల కోట్లు)గా అంచనా.
- కొనుగోలు పూర్తవగానే హెచ్‌బీఓ నెట్‌వర్క్, హ్యారీ పోటర్, ఫ్రెండ్స్ వంటి ప్రఖ్యాత కంటెంట్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తాయి.
- ప్రస్తుతం హాలీవుడ్‌లో అత్యంత విలువైన కంపెనీ అయిన నెట్‌ఫ్లిక్స్‌కి ఇది తొలి అతిపెద్ద కొనుగోలు.
అంతర్జాతీయ వినోద రంగంలో భారీ డీల్ కుదిరింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన నెట్‌ఫ్లిక్స్, ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ స్టూడియోలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ.6.47 లక్షల కోట్లు.
భారీ డీల్ విలువ ఎంత?
Netflix-Warner Bros: ఇంటర్నేషనల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని భారీ డీల్ జరుగనుంది. ప్రముఖ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ(Netflix-Warner Bros)కి సంబందించిన స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్‌లను కొనుగోలు చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుంది. ఈ రెండు సంస్థల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ ప్రపంచంలో అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ కాగా.. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ప్రపంచంలోనే పురాతన స్టూడియోలు కలిగిన సంస్థ కావడం విశేషం. ప్రస్తుతం ఈ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
నెట్‌ఫ్లిక్స్ చేతికి ఏమేం వస్తాయి?
Samantha: షూటింగ్ లో కొత్త పెళ్లికూతురు సమంత: హనీమూన్ లేదు.. వెకేషన్ లేదు.. పాపం
అంతర్జాతీయ వినోద రంగంలో కొత్త శకం
ఈ ఒప్పందం విలువ దాదాపు 72 బిలియన్ డాలర్లుగా తెలుస్తోంది. అనే మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.6.47 లక్షల కోట్లు. వార్నర్ బ్రదర్స్ కి సంబందించిన ఒక్కో షేరుకు 27.75 డాలర్లు చెల్లిస్తోంది నెట్‌ఫ్లిక్స్. ఈ ఒప్పందం ప్రకారం సీఎన్‌ఎన్, టీఎన్‌టీ, టీబీఎస్ వంటి కేబుల్ ఛానళ్లలో ఇప్పటికే ప్రారంభించిన మార్పులను వార్నర్ బ్రదర్స్ పూర్తి చేయాలి. దానికి సంబందించిన ప్రక్తియ పూర్తయిన వెంటనే కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతం హాలివుడ్‌లో అత్యంత విలువైన కంపెనీగా నెట్‌ఫ్లిక్స్ ఉంది. ఆ కంపెనీ ఈ స్థాయిలో కొనుగోలు చేపట్టడం ఇదే తొలిసారి అవడం విశేషం. ఇక ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తగానే హెచ్‌బీఓ నెట్‌వర్క్, ది సొప్రానోస్, ది వైట్ లోటస్ వంటి హిట్ షోల లైబ్రరీలు, హ్యారీ పోటర్, ఫ్రెండ్స్ వంటి సినిమాలు, టీవీ ఆర్కైవ్స్ వంటివి కూడా నెట్‌ఫ్లిక్స్ చేతుల్లోకి వెళతాయి.
ఈ కొనుగోలుతో నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోనుంది. వార్నర్ బ్రదర్స్ గొప్ప కంటెంట్ లైబ్రరీ నెట్‌ఫ్లిక్స్‌కు చేరడం వినోద రంగంలో కొత్త అధ్యాయాన్ని సృష్టించనుంది.


