
శుక్రవారం, సెప్టెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో రెండు బాలీవుడ్ డిజాస్టర్ సినిమాలు, సన్ ఆఫ్ సర్దార్ 2 మరియు దడక్ 2, ఒకే రోజు విడుదల అవుతున్నాయి. ఈ రెండు సినిమాలూ తమ థియేట్రికల్ రిలీజ్‌లో బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమయ్యాయి.
Key Points
సన్ ఆఫ్ సర్దార్ 2, దడక్ 2 సినిమాలు సెప్టెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల.
రెండు సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.
రెండు సినిమాలూ థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిరూపించుకున్నాయి.
ఓటీటీలో ఈ రెండు సినిమాలకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
నెట్‌ఫ్లిక్స్‌లో రెండు డిజాస్టర్ సినిమాలు
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి శుక్రవారం (సెప్టెంబర్ 26) రెండు డిజాస్టర్ సినిమాలు వస్తున్నాయి. ఇవి రెండూ బాలీవుడ్ సినిమాలే. అంతేకాదు ఆ రెండు సక్సెస్‌ఫుల్ మూవీస్ కి సీక్వెల్స్ కూడా కావడం విశేషం. మరి ఆ సినిమాలేవి? వాటి ఓటీటీ స్ట్రీమింగ్ విశేషాలేంటి అన్నది తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రిలీజెస్
నెట్‌ఫ్లిక్స్ లోకొ ఒకే రోజు అంటే ఈ శుక్రవారం రాబోతున్న ఆ రెండు సినిమాల్లో ఒకటి సన్ ఆఫ్ సర్దార్ 2 కాగా.. మరొకటి దడక్ 2. ఈ రెండు సినిమా స్ట్రీమింగ్ తేదీలను గురువారం (సెప్టెంబర్ 25) తన ఎక్స్ అకౌంట్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. “సైలెంట్‌గా ఉండు పుత్తర్.. సర్దార్ ఎంట్రీ కాబోతోంది. సన్ ఆఫ్ సర్దార్ 2 సెప్టెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ విషయం తెలిపింది.
సన్ ఆఫ్ సర్దార్ 2 మరియు దడక్ 2 ఓటీటీ విడుదల
ఇక అంతకుముందే దడక్ 2 మూవీ కూడా రాబోతున్నట్లు చెప్పింది. “రెండు ప్రపంచాలు, రెండు మనసులు, ఇప్పుడు ఒకే బీట్.. దఢక్ 2 రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది” అని ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. అయితే ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడ్డాయి.
సన్ ఆఫ్ సర్దార్ 2, దఢక్ మూవీస్ గురించి..
2012లో వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ మూవీ గుర్తుందా? కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర రూ.160 కోట్లు వసూలు చేసింది. దీని సీక్వెల్ అయిన సన్ ఆఫ్ సర్దార్ 2 ఈ ఏడాది ఆగస్టు 1న థియేటర్లలో రిలీజైంది. అయితే డిజాస్టర్ గా మిగిలిపోయింది. అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమాను రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.60 కోట్లు వసూలు చేసింది.
థియేటర్లలో బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్
ఇక దడక్ 2 మూవీ విషయానికి వస్తే.. ఇది కూడా డిజాస్టరే. 2018లో వచ్చిన దడక్ సినిమాకు ఇది సీక్వెల్. అప్పట్లో జాన్వీ కపూర్ తొలి సినిమా అది. రూ.41 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. రూ.110 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ అయింది. కానీ ఈ సీక్వెల్ తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది, తృప్తి దిమ్రి లీడ్ రోల్స్ లో నటించారు. దడక్ 2 మూవీని సుమారు రూ.60 కోట్లతో తెరకెక్కించగా.. కేవలం రూ.29 కోట్లే వసూలు చేసింది.
ఈ రెండు సినిమాలు ఒకే రోజు అంటే ఆగస్టు 1నే థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. రెండూ డిజాస్టర్లుగానే మిగిలిపోయాయి. మరి ఇప్పుడు రెండూ ఒకే రోజు నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తుండటంతో ఓటీటీలో వీటికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
చివరగా, థియేటర్లలో విఫలమైన రెండు సినిమాలు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటికి ఓటీటీలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.


