
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు త్వరగా తొలగించబడుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని సూపర్ హిట్ సినిమాలు త్వరలో అందుబాటులో ఉండవు. ఈ సినిమాలను చూడటానికి మీకు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది.
Key Points
రెడ్ ఐ, అవేకెనింగ్స్, అమెరికన్ బ్యూటీ, అమెరికాస్ స్వీట్ హార్ట్స్ వంటి సూపర్ హిట్ సినిమాలు నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగింపుకు సిద్ధమవుతున్నాయి.
జూలై 31 తేదీలోపు మీకు నచ్చిన సినిమాలను చూడండి.
థ్రిల్లర్స్, డ్రామాలు, రొమాంటిక్ కామెడీలు వంటి వివిధ జానర్ల సినిమాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ అద్భుతమైన సినిమాలను మిస్ అవ్వకండి!
నెట్‌ఫ్లిక్స్ నుండి తొలగబోతున్న సినిమాలు
ఓటీటీలు అందుబాటులోకి వచ్చినంత వేగంగా ఏ సినిమాలు చూడాలి ఏ సినిమాలు చూడకూడదు అనే అవగాహన కూడా వచ్చి ఉంటే బాగుండేది. బాగుందని ఓ సినిమా గురించి తెలిసి చూసేలోగానే థియేటర్లలో నుంచి వెళ్లిపోవడం మనకు అనుభవమే. అదే పరిస్థితి ఓటీటీల్లోని కొన్ని సినిమాల విషయంలోనూ మనకు ఎదురవుతుంటుంది. ఈ నేపధ్యంలో ఈ నెలాఖరులోగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ నుంచి నిష్క్రమించనున్న కొన్ని మంచి సినిమాల వివరాలివి.. వీటిలో మంచి ప్రశంసలు పొందిన ఆఫ్‌బీట్ కామెడీల నుంచి రోమాంచితం చేసే థ్రిల్లర్‌ల వరకు ఉన్నాయి ఈ జూలై 31లోగా చూడాలనుకుంటే తప్పక చూసేయండి. ఆ సినిమాలివే…
రెడ్ ఐ (2005) వెస్ క్రావెన్ దర్శకత్వం వహించిన రెడ్ ఐ థ్రిల్లర్‌లో హోటల్ మేనేజర్ అయిన రాచెల్ మెక్‌ఆడమ్స్ ని పూర్తిగా అపరిచితుడైన సిలియన్ మర్ఫీని అర్థరాత్రి పూట ఓ లేట్ నైట్ ఫ్లైట్ లో కలుస్తుంది. వారిద్దరి పరిచయం స్నేహపూర్వక సంభాషణగా ప్రారంభమై ఎన్ని అనూహ్య మలుపులు తీసుకుంటుంది? రెడ్ ఐలో చూడొచ్చు. అనుక్షణం ఉత్క o ఠ తో నడిచే ఈ సినిమా థ్రిల్లర్స్ ఇష్టపడే వారిని బాగా ఆకట్టుకుంటుంది
చివరి అవకాశం: మీకు నచ్చిన సినిమాలను చూడండి
అవేకెనింగ్స్ (1990) పెన్నీ మార్షల్ దర్శకత్వం వహించిన హృదయాన్ని తాకే ఈ డ్రామా జోనర్ చిత్రంలో రాబిన్ విలియమ్స్ అంకితభావంతో కూడిన వైద్యుడిగా కనిపిస్తాడు. కాటటోనిక్ రోగుల కోసం ఒక విప్లవాత్మక చికిత్సను ఆవిష్కరించిన తర్వాత జరిగింది ఏమిటి? పలు నిజమైన సంఘటనల నుండి అల్లుకున్న ఈ కధలో రాబర్ట్ డి నీరో పాత్రధారిగా లియోనార్డ్ లోవ్ కనిపిస్తాడు. జీవితంలోని సంక్షిప్త, విలువైన క్షణాలకు సంబంధించిన శక్తివంతమైన కథగా ఈ సినిమాని చెప్పొచ్చు.
అమెరికన్ బ్యూటీ (1999) సామ్ మెండిస్ దర్శకత్వం వహించగా, ఆస్కార్ అవార్డు అందుకున్న ఈ డార్క్ కామెడీలో కెవిన్ స్పేసీ లెస్టర్ బర్న్‌హామ్‌గా నటించాడు, శివారు ప్రాంతాల్లోని రొటీన్ లో చిక్కుకున్న తన జీవితానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ఈ పాత్ర ఆకట్టుకుంటుంది. అన్నెట్ బెనింగ్, థోరా బిర్చ్ మేనా సువారీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కాంక్ష, గుర్తింపులతో పాటు అమెరికన్ కలల తాలూకు భ్రమలను మనకు చూపిస్తుంది.
వివిధ జానర్ల సినిమాలు
అమెరికాస్ స్వీట్‌హార్ట్స్ (2001) జో రోత్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీలో ఒకనాటి స్టార్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్ హాలీవుడ్ తారల మధ్య చిక్కుకున్న ప్రచారకర్తగా నటించారు, ఆమెతో పాటు కేథరీన్ జీటా జోన్స్ జాన్ కుసాక్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. బిల్లీ క్రిస్టల్ హాస్యాన్ని జోడిస్తూ, ఈ చిత్రం గ్లామర్ ప్రపంచంలో తెరవెనుక ప్రేమల గందరగోళాన్ని మనకు చూపిస్తుంది.
పంచ్ డ్రంక్ లవ్ (2002) విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ నుంచి వచ్చిన ఈ ఆఫ్‌బీట్ రొమాంటిక్ డ్రామాలో ఆడమ్ సాండ్లర్ బారీ ఎగాన్ పాత్రలో నటించారు, కోపం అనే వ్యాధి తాలూకు సమస్యలతో ఉన్న ఒంటరి వ్యాపారి, అతను ఊహించని విధంగా ఎమిలీ వాట్సన్ తో ప్రేమలో పడతాడు. చమత్కారమైన, సున్నితమైన సన్నివేశాలతో ఆకట్టుకునే ఈ చిత్రం సాండ్లర్ అత్యంత ప్రసిద్ధ నటనల్లో ఒకటిగా నిలిచింది.
నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగబోతున్న ఈ అద్భుతమైన సినిమాలను చూసి, మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. జూలై 31 తేదీ ముగిసేలోపు వీటిని చూడటం మర్చిపోవద్దు!


