|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్! చర్లపల్లి-కామాఖ్య మధ్య కొత్త రైలు ప్రకటన!

Published: 10-03-2026, 5:45 AM
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్! చర్లపల్లి-కామాఖ్య మధ్య కొత్త రైలు ప్రకటన!
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి అస్సాంకు కొత్త రైలు మార్గం
  • తక్కువ ధరలో సౌకర్యవంతమైన ప్రయాణానికి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
  • మార్చి 13, 2026 నుండి చర్లపల్లి-కామాఖ్య రైలు ప్రారంభం
  • తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈశాన్య ప్రాంతానికి సులభ ప్రయాణం

తెలుగు రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త తెలిపింది. చర్లపల్లి నుండి కామాఖ్యకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనుంది. ఇది ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

అమృత్ భారత్ రైలు ప్రత్యేకతలు

తెలుగు రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేవారికి శుభవార్త. తక్కువ ఖర్చుతో వెళ్లిరావొచ్చు. భారతీయ రైల్వే హైదరాబాద్‌లోని చర్లపల్లి నుండి అస్సాం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య మధ్య కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించింది. ఈ అమృత్ భారత్ రైలు మార్చి 13, 2026 నుండి ప్రారంభం అవుతుంది. ఇది దక్షిణాది రాష్ట్రాలు, దేశంలోని ఈశాన్య ప్రాంతం మధ్య మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.

రైల్వే అధికారుల ప్రకారం.. కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మార్చి 13న కామాఖ్య నుండి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ సేవలో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఇవి సుదూర ప్రయాణికులకు సరసమైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఆప్షన్ అందిస్తాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆగే స్టేషన్లు

ఈ కొత్త రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను అస్సాంతో కలుపుతుంది. ఈశాన్యంలోని సెవెన్ సిస్టర్స్ రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా అస్సాంని చెబుతారు. అమృత్ భారత్ రైలు ఈశాన్య ప్రాంతానికి ప్రయాణించే, తిరిగి వచ్చే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అంతేకాగు తక్కువ ధరలో వెళ్లి రావొచ్చు.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మీదుగా ప్రయాణించే సమయంలో రైలు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ఏయే స్టాప్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి. కామాఖ్య నుంచి వచ్చే సమయంలో ఈ కింది స్టేషన్లలో ఆగుతుంది.

ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం

చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ రైలు వెళ్లే సమయంలో కూడా పైన చెప్పిన స్టేషన్లలో ఆగుతుంది. రైలు కనెక్టివిటీని బలోపేతం చేయడం, దేశంలోని దక్షిణ, ఈశాన్య ప్రాంతాల మధ్య ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణాన్ని అందించడం కోసం ఈ కొత్త సేవను భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది.

ఈ కొత్త రైలు సేవ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈశాన్య ప్రాంతానికి మరింత సులభంగా, తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.