|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్‌ సమస్యలు తీర్చేందుకు కొత్త కమిటీ

Published: 07-06-2025, 5:20 AM

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. థియేటర్ల సంక్షోభం, ఓటీటీ విడుదలలు, రిలీజ్‌ సమస్యలు ఇందులో కొన్ని. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఫిలిం ఛాంబర్ ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసింది.

Key Points

1

టాలీవుడ్‌లోని థియేటర్లు, ఓటీటీ విడుదలల సమస్యలను పరిష్కరించేందుకు కొత్త కమిటీ ఏర్పాటు.

2

నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు – మొత్తం 30 మంది సభ్యులతో కమిటీ.

4

సినిమా రిలీజ్‌ సమస్యలు, థియేటర్ల వెలవెలబోతున్న పరిస్థితిని సరిదిద్దేందుకు కమిటీ కృషి.

కమిటీ ఏర్పాటు: సభ్యుల వివరాలు

సాక్షి, హైదరాబాద్‌: వెలవెలబోతున్న థియేటర్లు, నెలరోజుల్లోనే ఓటీటీ ( OTT )లోకి సినిమాలు, సినిమా రిలీజ్‌ కష్టాలు.. ఇలా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ( Tollywood )ను ఎన్నో ఇబ్బందులు చుట్టుముట్టాయి. వీటి పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటైంది. తెలుగు సినీ పరిశ్రమలో కొంతకాలంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి తెలుగు ఫిలిం ఛాంబర్.. అంతర్గత కమిటీ ఏర్పాటు చేసింది.

ఇందులో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ విభాగాల నుంచి పది మంది చొప్పున సభ్యులుగా తీసుకుంది. మొత్తం 30 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. దీనికి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఫిలిం ఛాంబర్‌ సెక్రటరీ దామోదర ప్రసాద్‌ కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.

టాలీవుడ్‌ ఎదుర్కొంటున్న సవాళ్లు

ఏ విభాగంలో ఎవరున్నారంటే? నిర్మాతల విభాగం: దిల్ రాజు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, సి.కళ్యాణ్, రవి కిశోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియ

డిస్ట్రిబ్యూటర్‌ విభాగం: భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, ఎం.సుధాకర్, శిరీశ్ రెడ్డి, వెంకటేశ్ రావు, రాందాస్, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరి

కమిటీ లక్ష్యాలు మరియు ఆశించే ఫలితాలు

ఎగ్జిబిటర్‌ విభాగం: రాంప్రసాద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, వీర నారాయణబాబు, శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, మహేశ్వర రెడ్డి, శివప్రసాద్ రావు, విజయేందర్ రెడ్డి.

టాలీవుడ్‌లోని సమస్యల పరిష్కారానికి ఈ కొత్త కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఆశిద్దాం. వారి కృషితో పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.