
📌 Key Points
- లూలూ మాల్‌లో ‘రాజాసాబ్’ ఈవెంట్‌లో నిధి అగర్వాల్‌ను అభిమానులు వేధించారు.
- ఆమెను తాకుతూ నీచంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
- ఘటనపై కూకట్‌పల్లి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు.
- నిర్వాహకులు, మాల్ యాజమాన్యంపై కేసు, ఈవెంట్‌కు అనుమతి లేదని వెల్లడి.
టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఇటీవల ఓ ఈవెంట్‌లో చేదు అనుభవం ఎదురైంది. అభిమానుల దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై కూకట్‌పల్లి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం
టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal)కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. బుధవారం లూలూ మాల్‌లో రాజాసాబ్ సినిమాలోని రెండో పాట విడుదల నిధి అగర్వాల్ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే కొందరు దురభిమానులు గుమిగూడి హీరోయిన్ నిధి అగర్వాల్‌ను ఇబ్బందికి గురి చేయడంతో సోషల్ మీడియాలో వీడియోలు హల్‌చల్ చేశాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల సంఖ్యలో అభిమానులు మీద పడటంతో నిధికి ఊపిరి ఆడకుండా పోయింది. రక్షించే వారు లేక, బౌన్సర్లు లేక చాలా ఇబ్బంది పండింది. అభిమానులు ఎక్కడ పడితే అక్కడ తాకుతూ చాలా నీచంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. తాజాగా మరో వీడియో హల్‌చల్ చేస్తోంది. చాలా క్లోజ్‌గా నిధిని వెనుకవైపు టచ్ చేస్తూ ఉన్న వీడియోలు తాజాగా నెట్టింట పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురితో పాటు నెటిజన్లు కూడా అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసును కూకట్‌పల్లి పోలీసులు సుమోటోగా స్వీకరించారు. నిర్వాహకులతోపాటు మాల్ యాజమాన్యం పైన కేసు నమోదు చేశారు. ఈవెంట్‌కు సంబంధించి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు.
వైరల్‌గా మారిన మరో వీడియో
పోలీసుల సుమోటో కేసు, నిర్వాహకులపై చర్యలు
నిధి అగర్వాల్‌పై జరిగిన ఈ ఘటన సినీ పరిశ్రమలో, నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం నింపింది. పోలీసులు తీసుకున్న సుమోటో చర్యలు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆశావహంగా ఉన్నాయి.


