|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ఎత్తు వల్ల ఇబ్బంది పడ్డ నిధి అగర్వాల్! ‘రాజా సాబ్’ షూట్‌లో ఏం జరిగింది?

Published: 28-12-2025, 8:51 AM
ప్రభాస్ ఎత్తు వల్ల ఇబ్బంది పడ్డ నిధి అగర్వాల్! ‘రాజా సాబ్’ షూట్‌లో ఏం జరిగింది?
  • ప్రభాస్ ఎత్తు కారణంగా షూట్‌లో ఎత్తు పెంచే స్టాండ్ వేసుకోవాల్సి వచ్చిందని నిధి వెల్లడి.
  • గ్రీస్‌లో జరిగిన సాంగ్ షూటింగ్‌లో బ్రేక్‌ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు స్వయంగా వండుకున్న నిధి.
  • నటిగా కెరీర్‌లో మొదటిసారి ‘ది రాజా సాబ్’ సినిమాకు తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.
  • హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ జనవరి 9న థియేట్రికల్ రిలీజ్.

‘ది రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్‌తో పనిచేసిన అనుభవాన్ని నిధి అగర్వాల్ పంచుకుంది. ప్రభాస్ ఎత్తు వల్ల ఎదురైన సవాళ్లు, గ్రీస్‌లో స్వయంగా వంట, తొలిసారి డబ్బింగ్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లో ఆసక్తికరంగా మారాయి.

ప్రభాస్ ఎత్తుతో నిధికి సవాల్

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab). ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి(Maruthi). పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తుండగా.. యోగిబాబు, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ‘ది రాజా సాబ్’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా, జరిగిన ఈవెంట్‌లో నిధి అగర్వాల్ ప్రభాస్‌తో నటించిన అనుభవాలను పంచుకుంది. ‘‘ప్రభాస్‌తో పనిచేయడం నా కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయి. అయినప్పటికీ నేను ఇబ్బంది పడ్డాను.

ఆయన ఆరు అడుగులకు పైగా ఎత్తు ఉండటంతో.. ఆయనకు సరితూగడానికి నేను షూట్‌లో ఎత్తు పెంచే స్టాండ్ వేసుకోవాల్సి వచ్చింది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. నా కెరీర్‌లో తొలిసారి నా హైట్ విషయంలో చాలా ఫీల్ అయ్యా. స్క్రీన్ ప్రెజెన్స్ చూసి మొదట్లో కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ ప్రభాస్ చాలా సపోర్టివ్ నన్ను ఎంతో కంఫర్ట్‌గా ఉంచారు. గ్రీస్‌లో జరిగిన సాంగ్ షూటింగ్‌లో బయట ఫుడ్ కాకుండా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కానుంచి రాత్రి డిన్నర్ వరకు నేను స్వయంగా వండుకున్నాను. అంతేకాకుండా ఈ సినిమా కోసం మరో సాహసం చేశాను. నా కెరీర్‌లో మొదటిసారి తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను. ప్రేక్షకులకు మరింత దగ్గర కావడానికి నావంతు ప్రయత్నం చేశాను. ఇది నా కెరీర్‌లో టర్నింగ్ పాటింగ్ అవుతుందని భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది.

గ్రీస్‌లో వంట, తొలిసారి డబ్బింగ్

‘ది రాజా సాబ్’ మూవీ విశేషాలు

‘ది రాజా సాబ్’ తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుందని నిధి అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె పడ్డ కష్టం, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.