|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: గెటప్ శ్రీను నా ఫ్యామిలీలాంటి వాడు! బాంబ్ పేల్చిన నిహారిక!!

Published: 31-03-2026, 1:05 AM
షాకింగ్: గెటప్ శ్రీను నా ఫ్యామిలీలాంటి వాడు! బాంబ్ పేల్చిన నిహారిక!!
  • నిహారిక నిర్మాణంలో ‘రాకాస’ మూవీ విడుదల తేదీ ఖరారు: ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్!
  • గెటప్ శ్రీనుపై నిహారిక ప్రశంసలు: మా ఇంట్లో వాళ్ళలాగే నన్ను ప్రేమిస్తాడు అంటూ కామెంట్స్!
  • నిహారిక నిర్మిస్తున్న ‘వరి’ సినిమాలో గెటప్ శ్రీనుకి బంపర్ ఆఫర్!
  • ఫాంటసీ థ్రిల్లర్‌గా ‘రాకాస’: సంగీత్ శోభన్, నయన సారిక జంటగా నటిస్తున్నారు!

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఆమె నిర్మించిన రాకాస మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా గెటప్ శ్రీను గురించి నిహారిక చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

గెటప్ శ్రీనుపై నిహారిక కామెంట్స్ వైరల్!

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. ఫ్యామిలీ లైఫ్‌ పరంగానూ ఇబ్బందులు ఫేస్‌ చేసింది. కానీ ఇప్పుడు నిర్మాతగా మాత్రం సక్సెస్‌ అవుతుంది. ఇప్పటికే `కమిటీ కుర్రోళ్లు` చిత్రంతో హిట్‌ కొట్టింది. దీనికి అనేక అవార్డులు వచ్చాయి. ఇప్పుడు `రాకాస` అనే చిత్రాన్ని నిర్మించింది. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌, నయన సారిక జంటగా నటించారు. ఏప్రిల్‌ 3న ఈ చిత్రం విడుదల కానుంది. సోమవారం సాయంత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ, జబర్దస్త్ కమెడియన్‌ గెటప్‌ శ్రీనుపై ప్రశంసలు కురిపించింది. తన ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో, గెటప్‌ శ్రీను కూడా అంతే ప్రేమిస్తాడని తెలిపింది. తనని బాగా చూసుకుంటాడని వెల్లడించింది. ఆమె చెబుతూ, జబర్దస్త్ కమెడియన గెటప్‌ శ్రీనుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మా నాన్న వల్ల చాలా మంది పరిచయం అయ్యారు. ఎంతో మందిని కలిశాను. కానీ నేను కనుక్కొన్న బెస్ట్ బెస్ట్ బెస్ట్ పర్సన్‌ గెటప్‌ శ్రీను. బ్లడ్‌ రిలేషన్‌ లేకపోతే ఒక చెల్లిలాగ అంత ప్రేమ ఇతరులకు ఎందుకు ఉంటుంది అనుకునేదాన్ని. కానీ శ్రీనుగారిని చూశాక అంతా పోయింది. మా ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో, గెటప్‌ శ్రీను కూడా అంతే లవ్‌ చేస్తాడు. అంతే జాగ్రత్తగా చూసుకుంటాడు` అని చెప్పింది నిహారిక.

‘వరి’ సినిమాలో గెటప్ శ్రీనుకి బంపర్ ఆఫర్ ఇచ్చిన నిహారిక!

ఇంకా మాట్లాడుతూ, అందర అన్నారు జాలీ జాలీగా కావాలంటే శ్రీను వద్దకు వెళ్లాలి అని, కానీ సెట్‌ లో బాగా లేకపోతే, నేను ఫస్ట్ శ్రీను వద్దకే వెళ్తాను. నేను ఏం చెప్పినా, ముందు మీరు రిలాక్స్ అవ్వండి, వాటర్‌ తాగండి, టీ తాగండి అని చెబుతుంటారు. చాలా కేర్‌ తీసుకుంటారు. షూటింగ్‌ టైమ్‌లో అంత క్లోజ్‌ కాలేదుగానీ, ప్రమోషన్స్ టైమ్‌లో ఇంత క్లోజ్‌ అయ్యాం` అని చెప్పింది. అంతేకాదు గెటప్‌ శ్రీనుకు మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. `బరి` సినిమాలో అతను ఉంటాడని ప్రకటించింది. అన్నయ్య వరుణ్‌ తేజ్‌ హీరోగా నిహారిక `బరి` సినిమాని నిర్మిస్తుంది. ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభమైంది. వాలీబాల్‌ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్, విలేజ్‌ డ్రామా అది. అందులో గెటప్‌ శ్రీను కూడా ఉంటాడని నిహారిక చెప్పడం విశేషం.

ఏప్రిల్ 3న ‘రాకాస’ మూవీ రిలీజ్!

ఇక `రాకాస` మూవీ కామెడీ, ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఇందులో థ్రిల్లర్‌తోపాటు కామెడీ హైలైట్‌గా నిలుస్తుందని టీమ్‌ భావిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లకి విశేషమైన స్పందన లభించింది. నిహారిక ఇలా మంచి కాన్సెప్ట్, మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను నిర్మిస్తూ రాణిస్తోంది. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకుంది. అంతేకాదు నిహారిక నుంచి వస్తోన్న సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ అనే పేరుని సొంతం చేసుకోవడం విశేషం.

నిహారిక, గెటప్ శ్రీనుల మధ్య అనుబంధం గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. రాకాస మూవీ అప్డేట్స్ త్వరలో అందిస్తాం. మరిన్ని టాలీవుడ్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.