|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: రామ్ చరణ్ తో నిహారిక మూవీ? అసలు నిజం చెప్పేసిన మెగా డాటర్!

Published: 22-03-2026, 3:05 AM
షాకింగ్ న్యూస్: రామ్ చరణ్ తో నిహారిక మూవీ? అసలు నిజం చెప్పేసిన మెగా డాటర్!
  • రామ్ చరణ్ తో సినిమా రూమర్లపై నిహారిక క్లారిటీ: ప్రస్తుతానికి ఎలాంటి ప్లాన్స్ లేవని స్పష్టం!
  • తన అన్నయ్యలతో సినిమా చేసే అవకాశం వస్తే స్వయంగా ప్రకటిస్తానన్న నిహారిక కొణిదెల.
  • నిర్మాతగా రాణిస్తూ కంటెంట్ ఉన్న కథలను ఎంపిక చేయడమే లక్ష్యమన్న మెగా డాటర్.
  • ఏప్రిల్ 3న రాకాసా మూవీ విడుదల! సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు.

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. రామ్ చరణ్ తో కలిసి ఆమె సినిమా చేయబోతుందా? ఈ వార్తలకు నిహారిక ఎలా స్పందించారో చూద్దాం!

రామ్ చరణ్ తో సినిమాపై నిహారిక క్లారిటీ!

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తన ప్రయాణాన్ని మాత్రం చిన్నగానే స్టార్ట్ చేసింది. ప్రస్తుతం నిహారిక నిర్మాత కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె సంస్థ నుంచి వస్తున్న సినిమా రాకాసా. హారర్ అండ్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. మానస శర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యం రాకాసా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు నిహారిక.

నిర్మాతగా నిహారిక బిజీ బిజీ!

అయితే, గత కొంత కాలంగా నిహారిక(Niharika Konidela) తన అన్నయ్య, మెగా పవర్ స్టార్ తో సినిమా చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలపై నిహారిక స్పందించారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్‌లతో సినిమాలు చేయాలనేది తన చిరకాల కోరిక అని, అయితే ప్రస్తుతానికి అలాంటి ప్రణాళికలేవీ లేవని ఆమె స్పష్టం చేశారు. చరణ్ వంటి పాన్ ఇండియా స్టార్‌తో సినిమా తీసే స్థాయికి తాను ఇంకా ఎదగలేదని, భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఏప్రిల్ 3న రాకాసా మూవీ రిలీజ్!

“ఒకవేళ తన అన్నయ్యలతో సినిమా చేసే అవకాశం వస్తే ఆ విషయాన్ని స్వయంగా నేనే అధికారికంగా ప్రకటిస్తాను. అటువంటి గొప్ప సందర్భాన్ని లీకుల రూపంలో కాకుండా, ఎంతో గ్రాండ్‌గా అభిమానులతో పంచుకుంటాను. అంటూ చెప్పుకొచ్చింది. దీంతో, రామ్ చరణ్ సినిమాపై వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది. ఇక, నిహారిక ప్రస్తుతం ఒకవైపు నటిగా రాణిస్తూనే, మరోవైపు నిర్మాణ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కంటెంట్ ఉన్న కథలను ఎంపిక చేయడం, సినిమాలను నిర్మించడం వంటి బాధ్యతలే ఆమెకు ఎక్కువ సంతృప్తిని ఇస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఆమె నుంచి వస్తున్న రాకాసా సినిమా ఎలాంటి విజయాన్ని ఇస్తుంది అనేది చూడాలి.

నిహారిక నిర్మాణంలో వస్తున్న రాకాసా మూవీ ఏప్రిల్ 3న విడుదల కానుంది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.