|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిహారిక కొణిదెల నటించిన రొమాంటిక్ మూవీ.. థియేటర్లలో రిలీజైన 9 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఇక్కడ చూడండి

Published: 07-10-2025, 6:25 AM
నిహారిక కొణిదెల నటించిన రొమాంటిక్ మూవీ.. థియేటర్లలో రిలీజైన 9 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఇక్కడ చూడండి

నిహారిక కొణిదెల నటించిన తొలి రొమాంటిక్ మూవీ ‘ఒక మనసు’ థియేటర్లలో విడుదలైన సుదీర్ఘ కాలం తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. 2016లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు.

Key Points

1

నిహారిక కొణిదెల, నాగశౌర్యల 'ఒక మనసు' మూవీ.

2

2016లో థియేటర్లలో విడుదలైన రొమాంటిక్ డ్రామా.

4

థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ లేని ఈ సినిమా కథ విషాదంలో ముగుస్తుంది.

ఒక మనసు ఓటీటీలోకి ఎప్పుడు?

నిహారిక కొణిదెల, నాగశౌర్య జంటగా నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా ఒక మనసు. ఈ సినిమా జూన్ 24, 2016లో థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత ఈటీవీ విన్ ఓటీటీ మూవీని ప్రీమియర్ చేయబోతోంది. ఇది ఒకరకంగా కాస్తా ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఒక మనసు ఓటీటీ రిలీజ్ డేట్

ఒక మనసు మూవీ: కథ, నటీనటులు

నిహారిక కొణిదెల మూవీ ఒక మనసు ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఈ మూవీని గురువారం (అక్టోబర్ 9) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది.

“ప్రతి మనసుకు దగ్గరయ్యే ఓ లవ్ స్టోరీ. ఒక మనసు మూవీ అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. చూడండి” అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ఓటీటీ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా మూవీలోని లీడ్ రోల్స్ పోస్టర్ ను కూడా షేర్ చేసింది.

థియేటర్లలో సినిమా పరిస్థితి

ఒక మనసు అనేది 2016లో వచ్చిన ఓ రొమాంటిక్ డ్రామా. ఈ సినిమాను జీవీ రామ రాజు డైరెక్ట్ చేశాడు. మధుర శ్రీధర్ రెడ్డి, కృష్ణ భాటియా, అభినయ్ నిర్మించారు. ఈ సినిమాలో నాగ శౌర్య, నిహారికతోపాటు రావు రమేష్, కృష్ణ భగవాన్, శ్రీనివాస్ అవసరాల, ఆర్జే హేమంత్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా ఓ రాజకీయ నాయకుడి కొడుకు అయిన సూర్య, డాక్టర్ కావాలని కలలు కనే సంధ్య అనే అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీ.

అయితే ఓ విషాదంలో ముగిసిన స్టోరీ. దీంతో ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇందులో సంధ్య అనే పాత్రలో నిహారిక నటించింది. ఈ మూవీకి ఐఎండీబీలోనూ కేవలం 4.9 రేటింగ్ మాత్రమే నమోదైంది. ఇప్పటి వరకూ ఏ ప్రముఖ ఓటీటీలోనూ ఈ సినిమా అందుబాటులో లేదు. ఇప్పుడు ఈటీవీ విన్ ఈ సినిమాను తన ప్లాట్‌ఫామ్ లోకి తీసుకొస్తోంది. మరి ఓటీటీలో ఇన్ని రోజుల తర్వాత దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

థియేటర్లలో ఆశించిన స్పందన పొందలేకపోయిన ‘ఒక మనసు’ మూవీ 9 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో దీనికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.