|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Niharika Nm: అప్పుడు మహేశ్ తో యాడ్.. ఇప్పుడు పూరీతో మూవీ?

Published: 12-05-2025, 10:14 AM
Niharika Nm: అప్పుడు మహేశ్ తో యాడ్.. ఇప్పుడు పూరీతో మూవీ?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించే కొత్త సినిమాలో నిహారిక నటించనుందని వార్తలు వస్తున్నాయి. మహేశ్ బాబుతో యాడ్ లో నటించిన తర్వాత ఆమెకు ఈ అవకాశం వచ్చింది.

Key Points

1

పూరీ జగన్నాథ్ కొత్త సినిమాలో నిహారిక నటించనుందని వార్తలు

2

విజయ్ సేతుపతితో పాటు టబు, దునియా విజయ్ కూడా నటిస్తున్నారు

4

మహేశ్ బాబుతో ప్రమోషన్‌లో నటించి మరింత ఫేమస్ అయింది

పూరీ జగన్నాథ్ కొత్త ప్రాజెక్ట్

పూరీ జగన్నాథ్ కు వరస డిజాస్టర్లు పడ్డాయి. దీంతో టైం తీసుకుని విజయ్ సేతుపతిని ఓ సినిమా చేసేందుకు ఒప్పించాడు. ఇదంతా కొన్నిరోజుల క్రితం సంగతి. అప్పటినుంచి ఈ ప్రాజెక్టులోకి ఒక్కో యాక్టర్ వస్తున్నారు. ఇదివరకే టబు, దునియా విజయ్ ని కీలక పాత్రల కోసం ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు హీరోయిన్ గా ఇన్ స్టా బ్యూటీని తీసుకున్నట్లు తెలుస్తోంది.

లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి దెబ్బ మీద దెబ్బ పడింది. దీంతో పూరీ ఇకపై మూవీస్ చేయడం సందేహమే అని అందరూ ఫిక్సయ్యారు. మరి ఏం స్టోరీ చెప్పాడో ఏమో గానీ విజయ్ సేతుపతి.. పూరీతో కలిసి పనిచేసేందుకు ఓకే చెప్పాడు. కొన్నిరోజుల క్రితం ఈ కాంబోని అధికారికంగా ప్రకటించారు కూడా.

నిహారికకు హీరోయిన్ అవకాశం?

బెగ్గర్ అనే టైటిల్ అనుకున్నారని, అందుకు తగ్గట్లే కథ కూడా డిఫరెంట్ గా ఉండబోతుందనే ప్రచారం జరిగింది. టబు, దునియా విజయ్ లాంటి స్టార్స్ ని తీసుకునే సరికి అంచనాలు కాస్త ఏ‍ర్పడ్డాయి. ఇన్ స్టా వీడియోలతో ఫేమ్ తెచ్చుకున్న నిహారికని ఇప్పుడు హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని టాక్.

మహేశ్ బాబుతో యాడ్ ప్రభావం

తొలుత విజయ్ సరసన రాధిక ఆప్టే నటిస్తుందని రూమర్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ఫైనల్ గా నిహారిక ఆ పాత్రలో నటించనుందని సమాచారం. ఇన్ స‍్టాలో ఈమెకు 3.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మేజర్ సినిమాని నిర్మించిన మహేశ్ బాబు తో కలిసి ప్రమోషన్ చేయడంతో ఈమె ఫేమస్ అయింది. తర్వాత తమిళంలో ఇదయం మురళి, పెరుసు చిత్రాల్లో నటించింది. అలా ఇప్పుడు పూరీ కొత్త మూవీలో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం నిహారిక లక్ తోక తొక్కినట్లే.

నిహారికకు పూరీ జగన్నాథ్ సినిమాలో అవకాశం దక్కడం ఆమె అదృష్టమే. ఈ సినిమా ఆమె కెరీర్‌కు మంచి మలుపునివ్వవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.